Geetha Bhagat, Racha Ravi: కమెడియన్ రచ్చ రవి అత్యుత్సాహం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన గీతా భగత్

ఒక్కోసారి సినిమా వేడుకల్లో ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటాయి. ‘అంతా బాగానే జరుగుతుంది కదా’ అనుకున్న టైంలో వేదికపై ఉన్నవాళ్లలో ఎవరొకరు బ్యాలెన్స్ తప్పి మాట్లాడటం, అందువల్ల వాళ్ళు విమర్శలు ఎదుర్కోవాల్సి రావడం.. వంటివి మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి సంఘటన ఇంకోటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘ఓం భీమ్ బుష్’ అనే సినిమా టీజర్ లాంచ్ నిన్న హైదరాబాద్లో ఘనంగా జరిగింది.

సినిమా థీమ్ జనాల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో స్పేస్ నుండి వచ్చినట్టు హీరో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ..లు ఆ డ్రెస్ వేసుకుని స్టేజి పైకి వచ్చారు. ఈవెంట్ అయ్యే వరకు వాళ్ళు అదే డ్రెస్ లో ఉన్నారు. ఇక ఈ సినిమాలో ‘జబర్దస్త్’ ఫేమ్ రచ్చ రవి కూడా నటించాడు. దీంతో అతన్ని స్టేజి పైకి స్పీచ్ ఇవ్వడం కోసం ఆహ్వానించింది యాంకర్ గీతా భగత్.

రచ్చ రవి తన స్టైల్లో స్పీచ్ ఇచ్చిన అనంతరం.. యాంకర్ గీతా భగత్ పై డబుల్ మీనింగ్ డైలాగులు వేశాడు.’ ‘ఓం భీం బుష్’.. గీతా నీది మాయమైపోయింది నా దగ్గరకు వచ్చేసింది’ అంటూ ద్వంద్వార్థం ప్రతిభింభించేలా రచ్చ రవి షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో యాంకర్ గీతా భగత్ తో పాటు అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకైపోయారు. దీంతో రవి ‘నీ మనసు’ అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు.

అది యాంకర్ గీతాకి కోపం తెప్పించింది.దీంతో ఆమె కూడా ”ఓం భీం బుష్’ నీది కూడా మాయమైపోయింది’.. అంటూ పలికి.. ‘బుర్ర.. పని చేయలేదు మధ్యలో’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొంతమంది నెటిజెన్లు (Racha Ravi) రచ్చ రవి తీరుని వ్యతిరేకిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోని మీరు కూడా చూడొచ్చు.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus