Bigg Boss Telugu 6: ఆదిరెడ్డి కోసం శోకాలు పెట్టిన గీతు..! కావాలనే ఇలా చేసిందా..?

బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం ఎలిమినేషన్ లేకుండానే హోస్ట్ నాగార్జున హడావుడి చేశారు. శనివారం డైరెక్ట్ గా సూర్యని ఎలిమినేట్ చేసిన హోస్ట్ నాగార్జున. ఆదివారం హౌస్ మేట్స్ లో ఆటలు ఆడిస్తూ ఒక్కొక్కరిని సేఫ్ చేస్తూ వచ్చారు. దీనికి హౌస్ మేట్స్ లో టెన్షన్ మొదలైంది. డబుల్ ఎలిమినేషన్ తప్పదనే అనుకున్నారు. ఇక చివరకి వరకూ మెరీనా – ఆదిరెడ్డి ఇద్దరూ ఉండేసరికి ఆదిరెడ్డి టెన్షన్ పడ్డాడు. ఆదిరెడ్డి కంటే కూడా ఎక్కువగా గీతు ఆదిరెడ్డిని పట్టుకుని ఏడుస్తూ శోకాలు పెట్టింది.

నువ్వు హౌస్ నుంచీ వెళ్లిపోతే నన్ను అర్ధం చేస్కునే వారు ఎవరూ ఉండరని, నీకోసం నేను ఏదైనా చేస్తానని అన్నది. అంతేకాదు , బిగ్ బాస్ హౌస్ లో నువ్వు నాకు దొరికిన గిఫ్ట్ ఆదిరెడ్డి అంటూ మాట్లాడింది. మొదటి నుంచీ ఎవరితోనూ రిలేషన్ పెట్టుకోను, ఎవరితో ఫ్యామీలీ బాండింగ్ అనేది పెట్టుకోను అని చెప్పిన గీతు ఆదిరెడ్డికి బాగా కనక్ట్ అయ్యింది. గీతక్కా, గీతక్కా అంటూ ఆదిరెడ్డి ఎప్పుడూ గీతు చెప్పే మాటలు వింటూ మంచి కంపెనీ ఇచ్చాడు.

హౌస్ లో ఇద్దరూ రివ్యూవర్స్ కూడా గేమ్ ని ఎనలైజ్ చేస్కుంటూ ఉండేవారు. ఎప్పుడూ కలిసే ఉంటే ఆటని ఎవరు ఎలా ఆడుతున్నారో విశ్లేషిస్తూ కూర్చునే వారు. ఇప్పుడు ఆదిరెడ్డి చివరి వరకూ ఎలిమినేషన్ లో ఉండేసరికి గీతు తట్టుకోలేకపోయింది. మెరీనా సేఫ్ అయ్యి, ఆదిరెడ్డి ఎలిమినేట్ అయిపోతే తనకి హౌస్ లో కంపెనీ ఉండదని బాధపడింది. అంతేకాదు, ఆదిరెడ్డి వెళ్లిపోతే తన మాటల్ని అర్దం చేస్కునేవారు కానీ, తనపట్ల స్టాండ్ తీస్కునేవారు , సమర్ధించేవారు ఎవరూ ఉండరని చెప్పేసింది.

ఒక పక్కనుంచీ రేవంత్ ఓదారుస్తున్నా, ఆదిరెడ్డి నేను వెళ్లను అని చెప్తున్నా వినిపించుకోలేదు, వెక్కి వెక్కి ఏడుస్తూ శోకాలు పెట్టింది. చివరగా ఎలిమినేషన్ రౌండ్ వచ్చేసరికి గట్టిగా కళ్లు మూసుకుని కూర్చుండి పోయింది. చివర్లో మెరీనా ఇంకా ఆదిరెడ్డి ఇద్దరే ఉన్నప్పుడు కుండలని బద్దలు కొట్టించాడు బిగ్ బాస్. దీంతో ఇద్దరికీ గ్రీన్ వచ్చింది. ఇద్దరూ సేఫ్ అన్నట్లుగా ఎనౌన్స్ చేసాడు. దీంతో గీతు ఊపిరి పీల్చుకుంది.

చాలాసేపటి వరకూ ఆదిరెడ్డి సేఫ్ అంటూ హౌస్ మేట్స్ చెప్తున్నా నమ్మలేదు. ఆతర్వాత తేరుకుని ఆదిరెడ్డి దగ్గరకి వచ్చింది. ఇక గీతు ఆదిరెడ్డి కోసం ఇంతలా ఏడవటం ఏంటని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కావాలనే కంటెంట్ కోసం ఇలా చేసిందా.. లేదా హౌస్ లో తనకి ఎవరూ వెనకేసుకొచ్చేవారు ఉండరని అలా మాట్లాడిందా అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి గీతు ని కూడా బిగ్ బాస్ ఏడిపించేశాడుగా అని అంటున్నారు బిగ్ బాస్ లవర్స్. అదీ మేటర్.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus