Mahanati: జెమినీ గణేశన్ కూతురు కమల గణేషన్ షాకింగ్ కామెంట్స్

‘మహానటి’ సినిమా వచ్చి 5 ఏళ్ళు దాటేస్తుంది. కానీ ఆ సినిమా గురించి ఇప్పటికీ ఏదో ఒక కంప్లైంట్ వస్తూనే ఉంది. మొన్నామధ్య వాణిశ్రీ ..’ ‘మహానటి’ సినిమాలో చూపించింది అంతా అబద్దమే. అందుకే నిద్ర వచ్చేసింది’ అంటూ ఆమె కామెంట్ చేసింది. అలాగే చాలా మంది సీనియర్ నటీనటులు ‘మహానటి’ సినిమా గురించి నెగిటివ్ కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 2018 లో రిలీజ్ అయిన ‘మహానటి’ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది.

దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని (Mahanati) చాలా బాగా తెరకెక్కించాడు. కీర్తి సురేష్ కూడా అద్భుతంగా నటించింది. ఈ ఒక్క సినిమాతో ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. జెమినీ గణేశన్ గా దుల్కర్ సల్మాన్ కూడా అద్భుతంగా నటించి మెప్పించాడు. ఇతని పాత్ర జనాలకు చాలా కోపం తెప్పిస్తుంది. అవకాశాలు లేక సావిత్రిని ఇబ్బంది పెట్టినట్టు ఆ పాత్రని చూపించారు. అయితే ‘మహానటి’ లో జెమినీ గణేశన్ పాత్రని తప్పుగా చూపించారు అంటుంది అతని కూతురు కమల గణేశన్.

‘మా నాన్న గారు చాలా అందంగా ఉండేవారు. ఆయన్ని చూడటానికి ఎంతో మంది అమ్మాయిలు వచ్చేవారు. ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా నాన్న గారికి స్టార్ ఇమేజ్ ఉంది. కానీ సినిమాలో ఆయనకు అవకాశాలు లేవు అన్నట్టు చూపించారు. సావిత్రి గారిని పెళ్లి చేసుకోవడం అనేది విధి రాత. మహానటి సినిమాలో చూపించిన జెమినీ గణేష్ పాత్రలో నిజం లేదు.’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus