Genelia, Riteish: స్టేజిపై ఏడ్చేసిన జెనీలియా భర్త.. ఏమైందంటే?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ జెనీలియా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమె భర్త, బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్ ముఖ్ కూడా చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలోని లాతూర్ లో జరిగిన ఓ వేడుకలో రితేష్ దేశ్ ముఖ్ కంటతడి పెట్టుకోవడం చర్చనీయాంశం అయ్యింది. ఈ కార్యక్రమంలో రితేష్ మాట్లాడుతూ.. తన తండ్రి, దివంగత మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ ని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది.

‘నాన్న చనిపోయి 12 ఏళ్లు అయ్యింది.ఆయన మన మధ్య లేకపోవడం వల్ల ఎంతో బాధగా ఉంది. అతను ఈ రాష్ట్ర ప్రజల్లో ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నారు. ఇక్కడ కూడా ప్రకాశిస్తారు. ఆయన గొప్పతనం ఎప్పటికీ మసకబారదు. అతను ప్రజల కోసం బలంగా నిలబడ్డ గొప్ప నాయకుడు. తద్వారా ఇప్పుడు మేము, మా పిల్లలు కూడా నిలువెత్తు ఆవశ్యకతను అనుభవిస్తున్నాం. ఈరోజు ఆయన భౌతికంగా లేకపోయినా, మనపై ఆయన ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది.

ఈ స్టేజీ మీద ఉన్న నాకు అది స్పష్టంగా తెలుస్తుంది’ అంటూ రితేష్ (Riteish) కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ టైంలో పక్కనే ఉన్న ఆయన అన్నయ్య, లాతూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన అమిత్ దేశముఖ్ ఓదార్చారు. ఇక రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా 2012 లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు. ఇటీవల ఈ దంపతులు ‘వేద్’ అనే సినిమాలో జంటగా నటించారు. ఇది తెలుగులో సూపర్ హిట్ అయిన ‘మజిలీ’ కి రీమేక్.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus