Chiranjeevi, Anil Ravipudi: చిరు- అనిల్ రావిపూడి..ల సినిమా.. జోనర్ అదేనట..!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  ప్రస్తుతం ‘బింబిసార’ (Bimbisara) దర్శకుడు మల్లిడి వశిష్ట్ తో (Mallidi Vasishta)  ‘విశ్వంభర’  (Vishwambhara) అనే సినిమా చేస్తున్నాడు. ఇదొక సోసియో ఫాంటసీ మూవీ. ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వాస్తవానికి 2025 సంక్రాంతికే ఈ సినిమాని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కోసం-సమ్మర్ కి వాయిదా వేశారు. ఇది మెగాస్టార్ 156 వ సినిమాగా తెరకెక్కుతుంది. దీని తర్వాత చిరు ‘బంగార్రాజు’ (Bangarraju) దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో (Kalyan Krishna) సినిమా చేస్తారని అంతా అనుకున్నారు.

Chiranjeevi, Anil Ravipudi:

కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు హోల్డ్ లో పడింది. ఈ నేపథ్యంలో చిరు.. ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఎక్కువగా అనిల్ రావిపూడి పేరు వినిపించింది. ‘విశ్వంభర’ తర్వాత చిరు వెంటనే చేసేది అనిల్ రావిపూడి సినిమానే అని క్లారిటీ వచ్చేసింది. స్వయంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చేశారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam)  సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన నెక్స్ట్ సినిమాపై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. ‘తన నెక్స్ట్ సినిమా చిరంజీవితో ఉంటుందని’ చెప్పిన అనిల్ రావిపూడి (Anil Ravipudi) , ‘తర్వాత ఆ సినిమా జోనర్’ ఏంటి అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చేశారు. అది కంప్లీట్ ఎంటర్టైనర్ అని, చిరంజీవి గారి కామెడీ ‘టైమింగ్ ని కంప్లీట్ గా వాడుకుని ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్టు’ తెలిపాడు అనిల్.

‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ (Shankar Dada M.B.B.S) తర్వాత చిరు కామెడీ టైమింగ్ ని పూర్తిస్థాయిలో బయటకు తీసిన సినిమా రాలేదని.. తన సినిమాతో ఆ లోటుని తీర్చాలని ఆశపడుతున్నట్లు అనిల్ చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట. జూన్ నుండి సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.

మహేష్ ఫ్యామిలీ రికార్డులుకు జక్కన్న బిగ్ బ్రేక్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus