Getup Srinu: ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ పై గెటప్ శ్రీను ప్రశంసల వర్షం.. చెప్పిన విషయాలివే!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ కమెడియన్లలో గెటప్ శ్రీను ఒకరు. గెటప్ శ్రీను వైవిధ్యం ఉన్న రోల్స్ లో నటిస్తూ ప్రతిభను చాటుకుంటున్నారు. దేవర సినిమాలో చిన్న రోల్ లో నటిస్తున్న గెటప్ శ్రీను సినిమాలో తనకు మంచి పాత్ర దక్కిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. హీరో గారి కాంబినేషన్ లో సీన్లు ఉంటాయని గెటప్ శ్రీను వెల్లడించారు. నాకు చిరంజీవి గారు అంటే ఎంతో ఇష్టమని ఆయన తెలిపారు. చిరంజీవి తర్వాత నేను ఆ స్థాయిలో ఇష్టపడే హీరో జూనియర్ ఎన్టీఆర్ అని గెటప్ శ్రీను కామెంట్లు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్ అని ఆయన వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ టాలెంట్ చూసి ఆయనకు నేను ఫ్యాన్ అయిపోయానని శ్రీను చెప్పుకొచ్చారు. డ్యాన్స్, కామెడీ, ఎమోషనల్ ఏ వేరియేషన్ అయినా అవలీలగా చేసే యాక్టర్ తారక్ అని ఆయన కామెంట్లు చేశారు. బయట జూనియర్ ఎన్టీఆర్ చాలా ఫన్ గా ఉంటారని అందరితో సరదాగా ఉండటానికి జూనియర్ ఎన్టీఆర్ ఇష్టపడతారని గెటప్ శ్రీను అభిప్రాయపడ్డారు.

జూనియర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా రోజుల నుంచి ఎదురుచూశానని ఆయన వెల్లడించారు. గ్లింప్స్ సీన్ షూట్ జరిగిన సమయంలో నేను దేవర షూట్ లో పాల్గొనలేదని గెటప్ శ్రీను అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను పది సినిమాలు చేసిన తర్వాత జబర్దస్త్ కు వెళ్లానని ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీలో ఉన్న దర్శకుల కోసం కూడా నేను పాత్రలు చేసేవాడినని ఆయన పేర్కొన్నారు.

ప్రేక్షకులను అలరించడంతో పాటు డైరెక్టర్స్ మెప్పు కూడా పొందాలని గెటప్ శ్రీను అభిప్రాయపడ్డారు. ఇతరుల హావభావాలను గమనించి ఇమిటేట్ చేస్తానని ఆయన కామెంట్లు చేశారు. (Getup Srinu) గెటప్ శ్రీను కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus