Getup Srinu: ప్రభాస్ హీరోయిన్ గురించి షాకింగ్ న్యూస్ చెప్పిన గెటప్ శీను!

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతను తర్వాత ‘గాలోడు’ ‘కాలింగ్ సహస్ర’ (Calling Sahasra) వంటి సినిమాల్లో కూడా హీరోగా నటించాడు. ఇందులో ‘గాలోడు’ కమర్షియల్ గా హిట్ అయ్యింది. ‘కాలింగ్ సహస్ర’ అంతగా ఆడలేదు. ప్రస్తుతం అతను ‘గోట్’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి ఒక పాట రిలీజ్ అయ్యింది. దానికి మంచి స్పందన లభించింది.

Getup Srinu

తమిళ హీరోయిన్ దివ్య భారతి ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆమె లుక్స్ కూడా బాగానే ఉన్నాయి. సుధీర్ పక్కన ఈమె బాగానే సెట్ అయ్యింది. అయితే ‘గోట్’ కి ఫస్ట్ ఛాయిస్ ఈమె కాదట. ఏకంగా ప్రభాస్ (Prabhas) హీరోయిన్ ను అనుకున్నారట. ఈ విషయాన్ని సుధీర్ స్నేహితుడు, నటుడు అయినటువంటి గెటప్ శీను చెప్పుకొచ్చాడు.

గెటప్ శీను ( Getup Srinu) మాట్లాడుతూ.. “సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న ‘గోట్’ సినిమాకి హీరోయిన్ గా ఇమాన్విని అనుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఆమె రీల్స్ చూసి హీరోయిన్ గా బాగుంటుంది అని… సుధీర్ అలాగే దర్శకుడు భావించారు. ఆమె కాంటాక్ట్ అవి తీసుకుని ఆమెను సంప్రదించారు. కానీ ఎందుకో కుదరలేదు.

కానీ కట్ చేస్తే ఆమె ప్రభాస్- హను రాఘవపూడి (Hanu Raghavapudi)   సినిమాలో హీరోయిన్ అని అనౌన్స్ చేశారు. ఆ ప్రకటన చూసి మేము షాక్ అయ్యాము. సుడిగాలి సుధీర్ కోసం ఆమెను హీరోయిన్ అనుకుంటే ఏకంగా ప్రభాస్ గారి పక్కనే ఛాన్స్ కొట్టేసింది” అంటూ చెప్పుకొచ్చాడు. అతని కామెంట్స్ సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అన్ని సినిమాలు పెట్టుకుని సోలో రిలీజ్ అంటారేంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus