Vishwak Sen: అన్ని సినిమాలు పెట్టుకుని సోలో రిలీజ్ అంటారేంటి?

ప్రతివారం చిన్నవో, పెద్దవో కనీసం నాలుగైదు సినిమాలు థియేటర్లకు రాకుండా ఉండడం లేదు. జనాలు కూడా బాగుంటే అన్నీ చూస్తున్నారు లేదంటే మాత్రం వారికి కావాల్సిన ఒక్క సినిమా చూసి సైలెంట్ గా ఉంటున్నారు. అందుకే నిర్మాతలు కూడా తమ సినిమాలను పోటీపడి ప్రమోట్ చేస్తున్నారు. ఒక సినిమా విడుదలకు ముందు ఎంత బజ్ క్రియేట్ చేస్తే అంత హైప్ వస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నవంబర్ 14న “మట్కా(Matka), కంగువ(Kanguva)” సినిమాలు విడుదలవుతుండగా..

Vishwak Sen

నవంబర్ 22కి కూడా ఆల్రెడీ మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. వాటిలో విశ్వక్ సేన్ (Vishwak Sen) “మెకానిక్ రాకీ” (Mechanic Rocky) ఎప్పుడో డేట్ ప్రకటించగా.. సత్యదేవ్ (Satya Dev) “జీబ్రా” (Zebra) ఓ రెండు వారాల క్రితం ప్రమోషన్స్ మొదలుపెట్టారు. సడన్ గా ఈ లిస్ట్ లోకి వచ్చి చేరింది “దేవకీ నందన వాసుదేవ”(Devaki Nandana Vasudeva). అశోక్ గల్లా (Ashok Galla)  కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ఇవాళ విడుదలైంది. నిజానికి ఈ సినిమాని నవంబర్ 14న విడుదల చేద్దామనుకున్నప్పటికీ.. కారణాంతరాల వలన నవంబర్ 22కి పుష్ చేసారు.

అయితే.. ఇవాళ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత మాట్లాడుతూ పదే పదే “సోలోగా వద్దామనుకున్నాం” అని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. ఎందుకంటే.. ఓ కొత్త నిర్మాత అయ్యుండి, తమ సినిమాతోపాటు మరో రెండు సినిమాలు విడుదలవుతున్నాయి అనే విషయాన్ని ఎందుకు గుర్తించలేదు అనేది అర్థం కాలేదు.

అంటే విశ్వక్ సేన్ ను, సత్య దేవ్ ను లైట్ తీసుకున్నారా లేక కంగారులో ఆ సినిమాలు కూడా నవంబర్ 22కి రిలీజ్ ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయారా? అనేది వారికే తెలియాలి. అర్జున్ జంధ్యాల (Arun Jandyala) దర్శకత్వంలో తెరకెక్కిన “దేవకీ నందన వాసుదేవ”లో అశోక్ గల్లా సరసన మానస వారణాసి (Manasa Varanasi) కథానాయికగా నటిస్తుండగా.. భీమ్ (Bheems Ceciroleo) సంగీతం అందించాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus