అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఘాటి’ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ అయ్యింది . 2010 లో వచ్చిన ‘వేదం’ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క చేసిన సినిమా కావడంతో మొదట్లో ఆసక్తి ఉండేది. కానీ పలు కారణాల వల్ల సినిమా ఆలస్యం అవడం… ముఖ్యంగా అనుష్క లుక్స్ కోసం వి.ఎఫ్.ఎక్స్ చేస్తున్నారు వంటి ప్రచారం వల్ల ఆడియన్స్ లో ఆసక్తి తగ్గిపోయింది.
మొదటి రోజు పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా… ఆడియన్స్ కి అప్పటికే ఆసక్తి తగ్గిపోవడం వల్ల వాళ్ళు స్వీటీని చూడటానికి థియేటర్ కు రాలేదు. అందువల్ల మొదటి వీకెండ్ బిలో యావరేజ్ రేంజ్లో ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ తర్వాత డౌన్ అయిపోయింది. వీక్ డేస్ లో కోలుకుంది అంటూ ఏమీ లేదు. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.10 cr |
సీడెడ్ | 0.20 cr |
ఆంధ్ర (టోటల్) | 0.85 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 2.15 cr (షేర్) |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.22 cr |
ఓవర్సీస్ | 0.35 cr |
మిగిలిన వెర్షన్లు | 0.13 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 2.85 cr (షేర్) |
‘ఘాటి’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.26 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.2.85 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.4.42 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.22.15 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది.టాక్ పర్వాలేదు అనిపించే విధంగా వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేకపోయింది. ఇప్పుడు ‘మిరాయ్’ ‘కిష్కింధపురి’ వంటి కొత్త సినిమాలు వచ్చాయి కాబట్టి.. ‘ఘాటి’ని ఇక ఆడియన్స్ పట్టించుకునే అవకాశం లేదనే చెప్పాలి.