Ghaati: పాజిటివ్ టాక్ వచ్చినా క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఘాటి’

దాదాపు 2 ఏళ్ళ గ్యాప్ తర్వాత అనుష్క నుండి వచ్చిన చిత్రం ‘ఘాటి’.2010 లో వచ్చిన ‘వేదం’ తర్వాత అనుష్క, దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. విక్రమ్ ప్రభు ఈ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు. జగపతి బాబు, చైతన్య రావ్, జాన్ విజయ్, రవీంద్ర విజయ్ వంటి స్టార్స్ కూడా నటించారు. టీజర్,ట్రైలర్ బాగానే సౌండ్ చేశాయి. అందువల్ల సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.

Ghaati Collections

కానీ ఆ అంచనాలు ‘ఘాటి’ అందుకోలేకపోయింది. మొదటి రోజు టాక్ పర్వాలేదు అనిపించినా ఓపెనింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. రెండో రోజు మరింత తగ్గాయి. ఆదివారం రోజున కూడా సినిమా క్యాష్ చేసుకోలేకపోయింది. ఒకసారి ‘ఘాటి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

 

 

నైజాం  0.85 cr
సీడెడ్  0.12 cr
ఆంధ్ర (టోటల్)  0.65 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  1.62 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.15 cr
ఓవర్సీస్  0.24 cr
మిగిలిన వెర్షన్లు   0.11 cr
వరల్డ్ వైడ్ టోటల్   2.12 cr (షేర్)

 

‘ఘాటి’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.26 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.2.12 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3.40 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.23.88 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది.టాక్ పర్వాలేదు అనిపించే విధంగా వచ్చినప్పటికీ.. వీకెండ్ ను క్యాష్ చేసుకోలేక చతికిలపడింది. ఇప్పుడు వీక్ డేస్ పై భారం పడినట్టు అయ్యింది. చూడాలి మరి ఎలా నిలదొక్కుకుంటుందో.

మల్లెపూలు తీసుకెళ్ళినందుకు రూ.1.14 లక్షలు ఫైన్ కట్టిన నటి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus