Ghani OTT: ‘ఆహా’లో వరుణ్ తేజ్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..?

పాండమిక్ సమయంలో ఓటీటీ బిజినెస్ బాగా పుంజుకుంది. ప్రేక్షకులు ఓటీటీలో సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో చాలా మంది దర్శకనిర్మాతలు తమ సినిమాలను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. రీసెంట్ గా భారీ విజయం అందుకున్న ‘పుష్ప’ సినిమా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. ‘రాధేశ్యామ్’ సినిమా అయితే మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసింది.

ఇప్పుడు వరుణ్ తేజ్ నటించిన ‘గని’ సినిమా కూడా డిజిటల్ వేదికలపై సందడి చేయడానికి రెడీ అవుతోందని తెలుస్తోంది. కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. కన్నడ హీరో ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర‌, జ‌గ‌ప‌తి బాబు, న‌దియా ముఖ్య పాత్రలు పోషించారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు.

బాక్సింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు. అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కొన్ని ఏరియాల్లో ఓపెనింగ్స్ లేక సినిమాను తీసేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ బయటకొచ్చింది.

థియేటర్లలో ఈ సినిమా విడుదలైన మూడు వారాలకే ఓటీటీలో విడుదల కాబోతుందని సమాచారం. ఏప్రిల్ 29నుంచి ఈ సినిమా ఆహా వేదికపై స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతున్నారు. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రానుంది. మరి ఓటీటీలో ఈ సినిమాకి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి!

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus