Ginna Movie: ఆ ప్రేక్షకులు జిన్నా మూవీ చూడాలంటే రెంట్ కట్టాలా?

మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా మూవీ ఈ ఏడాది అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చినా వేర్వేరు కారణాలు ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపాయి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండగా థియేటర్లలో జిన్నా సినిమాను చూడని ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను చూసి ఈ సినిమా గురించి అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.

ఓటీటీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు అబవ్ యావరేజ్ అంటూ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఓవర్సీస్ ఆడియన్స్ కు మాత్రం అమెజాన్ ప్రైమ్ రెంట్ విధానంలో జిన్నా మూవీని అందుబాటులోకి తెచ్చినట్టు తెలుస్తోంది. యూఎస్ ఆడియన్స్ ఈ సినిమాను చూడాలంటే 2.99 డాలర్స్ రెంట్ చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. ఇండియాలో ఒక విధంగా అమెరికాలో ఒక విధంగా జిన్నా మూవీని స్ట్రీమింగ్ చేయడం కరెక్ట్ కాదని కొంతమంది చెబుతున్నారు.

ఈ సినిమాలో సన్నీ లియోన్ కీలక పాత్రలో నటించగా సన్నీ కోసం ఈ సినిమాను ఒక్కసారైనా చూస్తామని మరి కొందరు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా అమెజాన్ ప్రైమ్ లో జిన్నా మూవీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మంచు విష్ణు తర్వాత ప్రాజెక్ట్ ల గురించి క్లారిటీ రావాల్సి ఉంది. నిర్మాతగా కూడా బిజీ కావాలని విష్ణు భావిస్తున్నారని సమాచారం అందుతోంది.

మంచు విష్ణు సినిమాల శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ రేట్లకు అమ్ముడవుతున్నాయి. క్రేజ్ ఉన్న ఆర్టిస్టులు నటిస్తుండటంతో విష్ణు సినిమాల హిందీ డిజిటల్, స్ట్రీమింగ్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవుతున్నాయి. మంచు మనోజ్ కూడా త్వరలో కొత్త ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం అందుతోంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus