MAD 2: మ్యాడ్ 2 కోసం గ్లామరస్ బ్యూటీ.. గోల్డెన్ ఛాన్స్!

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఘన విజయాన్ని సాధించిన ‘మ్యాడ్’ (MAD) సినిమా ఇప్పుడు సీక్వెల్ ‘మ్యాడ్ 2’ (MAD 2) (మ్యాడ్ స్క్వేర్) రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి భాగంలో సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) , నార్నే నితిన్ (Narne Nithin), రామ్ నితిన్ (Ram Nithin) వంటి యంగ్ హీరోలు మెప్పించగా, సీక్వెల్ కోసం కూడా వీరు ముఖ్య పాత్రల్లోనే కనిపించబోతున్నారు. ఈ సీక్వెల్‌పై అంచనాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో, దర్శకుడు కల్యాణ్ శంకర్ దీనిని మరింత ఫన్‌తో, ఎంటర్‌టైన్‌మెంట్‌తో తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు.

MAD 2:

‘మ్యాడ్ 2’లో గ్లామర్ డోస్ మరింత పెంచాలనే ఉద్దేశంతో, దర్శకుడు కల్యాణ్ శంకర్ అందులో ఓ గ్లామరస్ టచ్ ఇవ్వాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక జవాల్కర్‌ను (Priyanka Jawalkar) ప్రత్యేక పాత్రలో తీసుకున్నారని తెలుస్తోంది. ట్యాక్సీ వాలా (Taxiwaala) సినిమాతో ప్రేక్షకులని ఆకట్టుకున్న ప్రియాంక జవాల్కర్ చాలా కాలంగా అవకాశాలు లేవు. దీంతో అమ్మడికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం ఆమె కొత్త తరహా పాత్రను పోషించనున్నట్లు సమాచారం.

ఇది ప్రాధాన్యత కలిగిన పాత్రగా ఉండబోతుందని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా వచ్చిన ‘మ్యాడ్’ చిత్రంలో గౌరీ ప్రియ (Sri Gouri Priya ) , అనంతిక సనీల్‌కుమార్(Ananthika Sanilkumar), గోపిక (Gopikaa Udyan) వంటి హీరోయిన్స్ ఉన్నప్పటికీ, ఎక్కువగా గ్లామర్ టచ్ ఇవ్వలేదు. ఈసారి ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని ప్రియాంక జవాల్కర్‌ను సినిమాలో ముఖ్య పాత్రకు ఎంపిక చేశారని అంటున్నారు. ఇందులో ఆమె కథకు కీలకంగా మారే ప్రత్యేక సన్నివేశాల్లో కనిపిస్తుందని, అలాగే ఓ ప్రత్యేక పాటను కూడా షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రియాంక ఇప్పటికే ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారని తెలిసింది.

ఆమెపై కొన్ని స్పెషల్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా చిత్రీకరించారని సమాచారం. ఈ సినిమాలో ఆమె పాత్ర మరింత ఆకర్షణీయంగా ఉండేలా దర్శకుడు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రియాంక ఈ గోల్డెన్ ఛాన్స్‌ను కచ్చితంగా సద్వినియోగం చేసుకుంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్లపై నాగ వంశీ (Suryadevara Naga Vamsi) సమర్పణలో సూర్యదేవర హారిక, సాయి సౌజన్య (Sai Soujanya) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక, గోపికతో పాటు రఘుబాబు (Raghu Babu), రచ్చ రవి (Racha Ravi), మురళీధర్ గౌడ్ (Muralidhar Goud) వంటి నటులు కూడా ఉన్నారు.

కంగువా ఓవర్ హైప్.. తేడా కొడితే అంతే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus