చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. వచ్చే నెల 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ కు రెండు వారాల సమయం మాత్రమే ఉన్నా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ జరగకపోవడం విషయంలో ఫ్యాన్స్ చాలా ఫీలవుతున్నారు. సల్మాన్ ఖాన్ సైతం ఈ సినిమా విషయంలో అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.
తన సీన్లకు సంబంధించి గ్రాఫిక్స్ సరిగ్గా లేకపోవడంతో ఆయన తెగ ఫీలవుతున్నారని బోగట్టా. ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోవడంతో సోషల్ మీడియా వేదికగా గాడ్ ఫాదర్ గురించి ట్రోలింగ్ జరుగుతోంది. తెలుగు శాటిలైట్ మినహా ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. పలు ఏరియాల్లో నిర్మాతలు సొంతంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు 150 కోట్ల రూపాయలకు పైగా మార్కెట్ జరిగింది.
ఆచార్య సినిమాతో పోలిస్తే ఈ సినిమాకు తక్కువగానే బిజినెస్ జరిగినా సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం పరిస్థితి మారే ఛాన్స్ ఉంది. దసరా పండుగకు పెద్దగా పోటీ లేకపోవడం ఈ సినిమాకు ప్లస్ కానుంది. గాడ్ ఫాదర్ రిలీజయ్యే వరకు పెద్దగా పోటీ లేకపోవడం ఈ సినిమాకు ప్లస్ అని చెప్పవచ్చు. చిరంజీవి ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదని సమాచారం అందుతోంది.
సినిమా రిలీజ్ అనంతరం వచ్చే లాభాల ఆధారంగా ఈ సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ డిసైడ్ కానుంది. చిరంజీవి ప్రస్తుతం ఒక్కో సినిమాకు 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ నెల 25వ తేదీన గాడ్ ఫాదర్ సినిమా నుంచి మరో ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటే సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.