God Father Trailer: చాలా మార్పులు చేశారు.. ఓకే అనిపించిన ‘గాడ్ ఫాదర్’ ట్రైలర్..!

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ చిత్రం తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ అయిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 5 న దసరా పండుగ కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆచార్య చేదు ఫలితాన్ని ఈ మూవీ మరిపించాలని కోరుకుంటున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తుండటం ప్రత్యేకతను సంతరించుకుంది. అంతేకాదు సత్యదేవ్, నయనతార, సముద్ర ఖని వంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఉండడం ఆకర్షించే అంశం.

తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇక కొద్దిసేపటి క్రితం ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. ‘మన స్టేట్ సీఎం పీ.కె.ఆర్ ఆకస్మిక మరణం. మంచోళ్ళందరూ మంచోళ్ళు కాదు. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనక’ అంటూ ఈ చిత్రంలో ఓ జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్న దర్శకుడు పూరి జగన్నాథ్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది. ‘అన్నయ్యోచ్చేసినాడు అన్ని ఒగ్గేసి ఎల్లిపొండి’ అంటూ వచ్చే డైలాగ్ ట్రైలర్ కు మంచి హై ఇచ్చింది.

ఈ చిత్రంలో చిరు బ్రహ్మ అనే పాత్రని పోషించారు. ఫ్యాన్స్ కు కావాల్సిన యాక్షన్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ను కూడా ట్రైలర్ లో ఎక్కువగానే చూపించారు. తమన్ అందించిన బిజీయం బాగానే ఉన్నా.. మళ్ళీ ఎక్కడో విన్నట్లు ఉంది. వి.ఎఫ్.ఎక్స్ విషయంలో మళ్ళీ ట్రోలింగ్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఓవరాల్ గా ఒరిజినల్ తో పోలిస్తే ఇక్కడ చాలా మార్పులు చేసినట్లు ట్రైలర్ చెబుతుంది. ఈ ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus