సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ.. ఫ్యామిలీ ఆడియన్స్ ను అమితంగా ఆకర్షిస్తున్న సినిమాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) గురించి చెప్పుకోవాలి. అపజయమంటూ తెలీని దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సంక్రాంతికి బోలెడన్ని హిట్లు కొట్టిన వెంకటేష్ (Venkatesh) హీరో కావడం, గతంలో వీరి కాంబినేషన్లో రూపొందిన ‘ఎఫ్ 2’ (F2 Movie) 2019 సంక్రాంతికి రిలీజ్ అయ్యి.. విన్నర్ గా నిలవడంతో 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ పై అంచనాలు పెరిగాయి.
ఇక ఈ చిత్రానికి భీమ్స్ (Bheems Ceciroleo) సంగీతం అందించారు. ఇక ప్రమోషన్లలో భాగంగా ఈరోజు ‘గోదారి గట్టుమీద’ అనే లిరికల్ సాంగ్ ను వదిలారు. 4 నిమిషాల నిడివి కలిగిన ఈ లిరికల్ సాంగ్ విషయానికి వస్తే.. ‘హే గోదారి గట్టు మీద రామసిలకవే’ అంటూ రమణ గోగుల (Ramana Gogula) వాయిస్ తో ప్రారంభం అయ్యింది. మొదటి రెండు లైన్స్ లోనే ఆయన మార్క్ కనిపించింది. ‘గోదారి గట్టుమీద మీద రామసిలకవే.. గోరింటాకెత్తుకున్న సందమామవే’ అంటూ భాస్కర్ భట్ల అందించిన లిరిక్స్ కూడా చాలా బాగా కుదిరాయి.
రమణ గోగులతో పోటాపోటీగా మధుప్రియ (Madhu Priya) కూడా హుషారుగా ఈ పాటని పాడింది. భీమ్స్ అందించిన ట్యూన్ కూడా చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. వెంకటేష్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)..ల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది అని స్పష్టమవుతుంది. వాళ్ళు ఈ సాంగ్లో చేసిన సింపుల్ డాన్స్ మూమెంట్స్ కూడా ప్రేక్షకుల్లో జోష్ నింపే విధంగా ఉన్నాయి. లిరికల్ సాంగ్ మధ్యలో వచ్చే ఆ విజువల్స్ కూడా హైలెట్ అయ్యాయి అని చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం ఈ లిరికల్ సాంగ్ ను మీరు కూడా చూస్తూ వినేయండి :