Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Reviews » Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 8, 2026 / 08:01 AM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సుమంత్ ప్రభాస్ (Hero)
  • నిధి ప్రదీప్ (Heroine)
  • జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ (Cast)
  • సుభాష్ చంద్ర (Director)
  • అభినవ్ రావు (Producer)
  • నాగ వంశీ కృష్ణ (Music)
  • సాయి సంతోష్ (Cinematography)
  • అనిల్ కుమార్ పి (Editor)
  • Release Date : 8th మే 2026
  • రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ (Banner)

మేము ఫేమ‌స్ మూవీతో హీరోగా తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించాడు సుమంత్ ప్ర‌భాస్‌ (Sumanth Prabhas). తొలి సినిమాను తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో చేసిన సుమంత్ ప్ర‌భాస్‌…రెండో మూవీ కోసం కోన‌సీమ నేప‌థ్యాన్ని ఎంచుకున్నాడు. సుమంత్ ప్ర‌భాస్ హీరోగా రూపొందిన గోదారి గ‌ట్టుపైన శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు సుభాష్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. నిధి ప్ర‌దీప్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ లో జ‌గ‌ప‌తిబాబు, లైలా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. వెరైటీ ప్ర‌మోష‌న్స్‌తో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించిన ఈ చిన్న సినిమా ఎలా ఉంది? హీరోగా సుమంత్ ప్ర‌భాస్‌కు మ‌రో హిట్టు ద‌క్కిందా? లేదా? అంటే?

Godari Gattupaina Movie Review

Godari Gattupaina Movie Review and Rating

క‌థ‌: రాజు (సుమంత్ ప్ర‌భాస్‌) ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కే చ‌దువుకుంటాడు. కుటుంబ బాధ్య‌త‌ల కార‌ణంగా ఆటోడ్రైవ‌ర్‌గా మారుతాడు. ఇంజినీరింగ్ చ‌దివే మాయ‌తో (నిధి ప్ర‌దీప్‌) ప్రేమ‌లో ప‌డ‌తాడు. మాయ చ‌దువులో టాప‌ర్‌. తండ్రి శ్యాంబాబు (జ‌గ‌ప‌తిబాబు) లోకంగా బ‌తుకుతుంది. తండ్రి చెప్పిన వాడినే పెళ్లిచేసుకోవాల‌ని క‌ల‌లు కంటుంది. కానీ రాజు మాట‌లు, మంచిత‌నం చూసి అత‌డిని ఇష్ట‌ప‌డుతుంది మాయ‌. ఇద్ద‌రివి వేర్వేరు కులాలు కావ‌డం, రాజు ఆటోడ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌టంతో శ్యాంబాబు కుట్ర‌ప‌న్ని మాయ‌కు అత‌డిని దూరం చేస్తాడు? ఆ త‌ర్వాత ఏమైంది? కూతురి ప్రేమ‌ను శ్యాంబాబు అర్థం చేసుకున్నాడా? రాజు మంచిత‌నం అత‌డిలో మార్పును తీసుకొచ్చిందా? రాజు, మాయ ఒక్క‌ట‌య్యారా? వీరి ప్రేమ‌కు రెహ‌మాన్‌తో (సుద‌ర్శ‌న్‌) పాటు మిగిలిన స్నేహితులు ఎలాంటి సాయం చేశారు అన్న‌దే మిగిలిన క‌థ‌.

Godari Gattupaina Movie Review and Rating

న‌టీన‌టుల ప‌నితీరు: ఆటోడ్రైవ‌ర్ పాత్ర‌కు సుమంత్ ప్ర‌భాస్ పూర్తిగా న్యాయం చేశారు. నాచుర‌ల్ ప‌ర్ఫార్మెన్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. ఓవ‌ర్ హీరోయిజం ఎలిమెంట్స్ లేకుండా సెటిల్డ్‌గా ఈ క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేసిన తీరు బాగుంది. తెలంగాణ కుర్రాడు అయిన గోదారి యాస‌లో డైలాగ్స్ చెప్ప‌డం కోసం బాగానే క‌ష్ట‌ప‌డ్డాడు. హీరోయిన్ పాత్ర‌కు నిధి ప్ర‌దీప్ సెట్ట‌య్యింది. త‌క్కువ మేక‌ప్‌తో క‌నిపించింది. కూతురిని అమితంగా ప్రేమించే తండ్రి పాత్ర‌లు చేయ‌డం జ‌గ‌ప‌తిబాబుకు కొత్తేమీ కాదు. ఈజీగా శ్యాంబాబు క్యారెక్ట‌ర్‌ను ఓన్ చేసుకున్నారు. లైలా సినిమాలో ఉందంటే ఉంది. ఆమె క్యారెక్ట‌ర్‌కు స‌రైన జ‌స్టిఫికేష‌న్‌, డైలాగ్స్ క‌నిపించ‌వు. సుద‌ర్శ‌న్ కామెడీ కొన్ని చోట్ల ప‌ర్వాలేద‌నిపిస్తుంది. రాజ్‌కుమార్ క‌సిరెడ్డితో వైవా రాఘ‌వ్‌, రోహిత్ కృష్ణ వ‌ర్మ మాత్రం అంత‌గా న‌వ్వించ‌లేక‌పోయాచు. దేవిశ్రీప్ర‌సాద్‌, రాజీవ్ క‌న‌కాల‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ త‌మ ప‌రిధుల మేర ఆక‌ట్టుకున్నారు.

Godari Gattupaina Movie Review and Rating

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: నాగ‌వంశీ కృష్ణ బీజీఎమ్‌, పాట‌లు గ‌తంలో వ‌చ్చిన‌ ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల‌ను గుర్తుకుతెచ్చాయి. ప్ర‌భాస్ రిఫ‌రెన్స్‌లు బాగానే వాడుకున్నారు. సినిమా నిడివి రెండున్న‌ర గంట‌ల కంటే త‌క్కువే కానీ లెంగ్తీ ఫీలింగ్ క‌లుగుతుంది. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ ప‌ర‌వాలేదు. గోదారి జిల్లాల అందాల‌ను డీవోపీ సాయి సంతోష్ స్క్రీన్‌పై అందంగా చూపించారు.

Godari Gattupaina Movie Review and Rating

విశ్లేష‌ణ‌: నిస్వార్థ‌మైన ప్రేమకు కుల‌మ‌తాలు, ఆస్తులు, అంత‌స్తులు ఏవి అడ్డుగోడ‌గా నిల‌వ‌వ‌నే కాన్సెప్ట్‌తో కోన‌సీమ‌ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా డైరెక్ట‌ర్‌ సుభాష్ చంద్ర గోదారి గ‌ట్టుపైన సినిమాను తెర‌కెక్కించారు. త‌న తండ్రి కంటే అమితంగా త‌న‌ను ప్రేమించే అబ్బాయి భ‌ర్త‌గా రావాల‌ని క‌ల‌లు క‌నే అమ్మాయి జీవితం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఆమె లైఫ్‌లోకి వేరే మ‌తానికి చెందిన భిన్న మ‌న‌స్త‌త్వంతో కూడిన ఓ అబ్బాయి ఎలా ఎంట‌ర‌య్యాడు? ఈ క్ర‌మంలో వారి ప్రేమ‌లో ఎదురైన సంఘ‌ర్ష‌ణ‌ను ఎమోష‌న్స్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ మిక్స్ చేస్తూ ఈ సినిమాలో చూపించారు డైరెక్ట‌ర్‌.

తండ్రిపై కూతురికి ఉన్న అతి ప్రేమ కొన్ని సార్లు ఎలా స్వార్థంగా మారుతుంద‌న్న‌ది ఆలోచ‌నాత్మ‌కంగా చెప్పారు. ప్రేమ‌కు మ‌న‌సులు క‌లిస్తే చాల‌ని, కులాల‌తో ప‌నిలేద‌నే మెసేజ్ ఇచ్చారు. ఈ సందేశాన్ని క్లాస్ ఇస్తున్న‌ట్లుగా ఫోర్స్‌డ్‌గా కాకుండా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌గా క‌న్వీన్సింగ్‌గా చెప్పిన విధానం బాగుంది. ఆటోడ్రైవ‌ర్లు అన‌గానే చుల‌క‌న‌గా చూస్తుంటారు. సినిమాల్లోనూ వారిని మాసీగా చూపించ‌డం అల‌వాటైపోయింది. కానీ ఆటోడ్రైవ‌ర్ల‌లో మంచి మ‌నుషులు ఉంటార‌నే పాయింట్ కొత్త‌గా అనిపించింది.

కోన‌సీమ బ్యాక్‌డ్రాప్ ఈ ప్రేమ‌క‌థ‌కు ప్ల‌స్స‌య్యింది. డైలాగ్స్ కూడా కంప్లీట్ కోన‌సీమ యాస‌లోనే రాసుకున్నారు డైరెక్ట‌ర్‌. కోన‌సీమ కుర్రాళ్ల అల్ల‌ర్లు, వారి మ‌ధ్య ఉండే స్నేహాం, ఆత్మీయ‌త ఎలా ఉంటాయ‌న్న‌ది నాచుర‌ల్‌గా ప్ర‌జెంట్ చేశారు. హిందూ, క్రిస్టియ‌న్‌, ముస్లిం.. మ‌తాల ప్ర‌స్తావ‌న ఈ సినిమాలో క‌నిపిస్తుంది. ఈ సెన్సిటివ్ టాపిక్‌ను మ‌రి హైలైట్ చేయ‌కుండా క‌థ‌లోనే అంత‌ర్భాగంగా చూపించారు.

శ్యాంబాబుకు కూతురిపై ఉన్న ప్రేమ‌ను చూపిస్తూనే ఈ సినిమా మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత రాజు, అత‌డి స్నేహితుల పాత్ర‌ను ప‌రిచ‌యం, మాయ‌ను ప్రేమ‌లో దించ‌డానికి రాజు వేసే ప్లాన్స్ చుట్టూ ఫ‌స్ట్ హాఫ్ టైమ్‌పాస్‌గా సాగ‌తుంది. తండ్రి కోసం రాజు ప్రేమ‌ను మాయ కాద‌నే సీన్‌తోనే ఇంట‌ర్వెల్ ట్విస్ట్ ఆస‌క్తిని పంచుతుంది. మాయ‌లోని క‌న్ఫ్యూజ‌న్స్‌కు ఎలా స‌మాధానాలు దొరికాయ‌నే అంశాల‌తో సెకండాఫ్‌ను ఎమోష‌న‌ల్‌గా చూపించారు. రాజు ఫ్యామిలీ ఎపిసోడ్, చెల్లెలి పెళ్లి ట్రాక్ ఆక‌ట్టుకుంటాయి. రాజును మాయ‌ను విడ‌గొట్టాల‌ని అనుకున్న శ్యాంబాబు వేసిన ఎత్తు ప‌ర్వాలేద‌నిపిస్తుంది. మ‌రీ సినిమాటిక్‌గా కాకుండా రియ‌ల్‌గా అలా జ‌ర‌గొచ్చు అనే ఫీల్ క‌లిగేలా ఆ ట్రాక్ రాసుకున్నారు. క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది.

గోదారి గ‌ట్టుపైన కాన్సెప్ట్ కొత్త‌దేమీ కాదు. ఈ పాయింట్‌తో తెలుగులో ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. హీరోహీరోయిన్లు క‌ల‌వ‌డానికి, విడిపోవ‌డానికి గ‌ల‌ కార‌ణాల‌ను బ‌లంగా రాసుకోలేక‌పోయారు. సుద‌ర్శ‌న్‌, రాజ్ కుమార్ క‌సిరెడ్డి పంచ్‌లు చాలా వ‌ర‌కు పేల‌లేదు. అర‌వ సినిమాలా కామెడీ చాలా లౌడ్‌గా అనిపిస్తుంది.

Godari Gattupaina Movie Review and Rating

ఫోకస్ పాయింట్: గోదారి గ‌ట్టుపైన టైటిల్‌కు త‌గ్గ‌ట్లే స్వీట్ అండ్ సింపుల్ ల‌వ్‌స్టోరీ.

రేటింగ్: 2.75/5

 

Rating

2.75
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Godari Gattupaina Movie
  • #jagapathi babu
  • #Laila
  • #Nidhi Pradeep
  • #Subash Chandra

Reviews

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

18 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

18 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

20 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

21 hours ago

latest news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

16 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

17 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

18 hours ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

19 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version