మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ అక్టోబర్ 5న విజయదశమి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. కొణిదెల సురేఖ సమర్పణలో ‘కొణిదెల ప్రొడక్షన్స్’, ‘సూపర్ గుడ్ ఫిలింస్’ బ్యానర్ లపై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఫస్ట్ డే ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినా పర్వాలేదు అనిపించాయి. అయితే వీక్ డేస్ లో ఈ మూవీ పెద్దగా రాణించింది లేదు. ఇక రెండో వీకెండ్ సో సో గా కానిచ్చేసింది తప్ప పెద్దగా క్యాష్ చేసుకున్నది లేదు .ఒకసారి 12 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 12.03 cr |
సీడెడ్ | 9.37 cr |
ఉత్తరాంధ్ర | 5.71 cr |
ఈస్ట్ | 3.70 cr |
వెస్ట్ | 2.31 cr |
గుంటూరు | 3.94 cr |
కృష్ణా | 2.71 cr |
నెల్లూరు | 2.04 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 41.81 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.63 cr |
హిందీ | 4.97 cr |
ఓవర్సీస్ | 5.10 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 56.51 cr (షేర్) |
‘గాడ్ ఫాదర్’ చిత్రానికి అన్ని వెర్షన్లు కలుపుకుని కు రూ.91.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.92 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 12 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.56.51 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ.35.49 కోట్ల షేర్ ను రాబట్టాలి. లాంగ్ రన్ లో నిలబడి మంచి కలెక్షన్లు రాబడితే తప్ప ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమనే చెప్పాలి.
Most Recommended Video
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!