ఓ సినిమా మీద బజ్ పెంచడం ఎలా? ఓ సినిమాకు హైప్ తీసుకురావడం ఎలా? ఇలాంటి వాటికి సమాధానాలు కావాలంటే.. చాలా మందిని అడగాలి. వాటికి సమాధానాలు చెప్పడానికి చాలా టాలెంట్ కూడా కావాలి. అయితే ఓ సినిమా మీద అంతోకొంత ఉన్న హైప్, బజ్‌ను చంపేయడం ఎలా.. ఈ మాటకు సమాధానం చెప్పాలంటే ‘గాడ్ ఫాదర్’ టీమ్‌ని మించి ఎవరూ లేరేమో అనిపిస్తుంది. కావాలంటే ఈ సినిమాకు చేస్తున్న ప్రచారం చూడండి మీకే తెలిసిపోతుంది.
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ లాంటి సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు అంటే.. అభిమానుల్లో ఆసక్తి ఉంటుంది. సినిమా అక్కడే అదిరిపోయింది, ఇక్కడ బాస్ చేస్తే ఇంకా బాగుంటుంది అని అనుకుంటారు. అయితే ఎంతటి సినిమా తీసినా దానికి ప్రచారం తప్పనిసరిగా చేయాలి. అలా అని ఓవర్ ప్రమోషన్స్ చేస్తే ఏమవుతుందో ఒక నెల క్రితం చూశాం. అయితే కనీసం సరైన ప్రమోషన్స్ లేకుండా వస్తే ఇబ్బంది తప్పదు. ఇవన్నీ తెలిసి కూడా ‘గాడ్ ఫాదర్’ టీమ్ ప్రచారం విషయంలో డల్‌గా ఉంది.
ఇదే ఒక ఇబ్బంది అనుకుంటే.. తొలి పాట, మాస్ పాట, బీట్‌తో అదరగొడతారు అంటూ హైప్ ఇచ్చి ‘తార్ మార్ తక్కడ్ మార్’ అనే పాట టీజర్ విడుదల చేశారు. దాని లిరికల్ వెర్షన్ ఇస్తామని చెప్పి, ఆడియో వెర్షన్ ఇచ్చారు. తీరా లిరికల్ వెర్షన్ వచ్చే సరికి తుస్‌మంది. పాటలో సరైన స్టెప్పులు లేవు. చిరంజీవి ఫేస్‌లో యాక్టివ్‌నెస్ లేదు. అంతా అదో మాదిరిగా ఉంది. దీంతో అభిమానుల ఆగ్రహం మరింత ఎక్కువైపోయింది.
సినిమా నీరసమైన ప్రచారానికి, తమ్ కాపీ మ్యూజిక్ తోడై సినిమా హైప్‌ను ఇంకా చంపేసింది అని చెబుతున్నారు. పాటలో ఏమన్నా ఊపు ఉంటే.. కాస్త ఉపయోగం ఉండేది. పాటమో నీరసంగా, స్టెప్పులేమో సప్పుడు లేకుండా ఉండటంతో అభిమానులు చాలా నిరాశకు గురయ్యారని చెప్పొచ్చు. మరి ట్రైలరేనా బాగుంటే అంతే చాలు అనుకుంటున్నారు ఫ్యాన్స్.
Most Recommended Video
శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!