Godse Collections: ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోతున్న ‘గాడ్ సే’.!

టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ సే’. ‘సి.కె.స్క్రీన్స్’ బ్యానర్ పై సి.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రానికి గోపికృష్ణ పట్టాభి దర్శకుడు. గతంలో వీరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రం పర్వాలేదు అనిపించింది. దీంతో ‘గాడ్ సే’ కూడా ఆకట్టుకుంటుంది అని అంతా అనుకున్నారు. ఐశ్వర్య లక్ష్మి, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. జూన్ 17న విడుదలైన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది.

దీంతో మొదటి రోజు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. వీకెండ్ ను కూడా పెద్దగా క్యాష్ చేసుకోలేకపోతున్న ఈ మూవీ వీక్ డేస్ లో బాక్సాఫీస్ వద్ద మరింతగా కష్టపడుతుంది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.26 cr
సీడెడ్ 0.14 cr
ఉత్తరాంధ్ర 0.16 cr
ఈస్ట్ 0.04 cr
వెస్ట్ 0.05 cr
గుంటూరు 0.06 cr
కృష్ణా 0.08 cr
నెల్లూరు 0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.83 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.04 cr
ఓవర్సీస్ 0.02 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.89 cr

‘గాడ్ సే’ చిత్రానికి రూ.3.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.3.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.0.89 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.2.71 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. టాక్ నెగిటివ్ గా రావడం..

పోటీగా ‘అంటే సుందరానికీ!’ ‘విరాటపర్వం’ ‘విక్రమ్’ వంటి చిత్రాలు ఉండడం వలన ఈ మూవీ ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోతుంది. ఈ ఓపెనింగ్స్ తో బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమనే చెప్పాలి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus