ఇంటర్వ్యూ మధ్యలోనే వెళ్లిపోయిన దర్శకుడు!

ఈ శుక్రవారం నాడు ‘విరాటపర్వం’ సినిమాతో పాటు సత్యదేవ్ నటించిన ‘గాడ్సే’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపీ గణేష్ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో సత్యదేవ్ ఒక రివల్యూషనరీ క్యారెక్టర్ లో నటించారు. ప్రస్తుత రాజకీయాల్లో, వ్యవస్థలో కుళ్లును కడిగి పడేసే నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ చాలా పవర్ ఫుల్ డైలాగ్స్ వినిపించాయి. నిజానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చాలా కాలమవుతుంది కానీ వాయిదాల మీద వాయిదాలు పడి ఆలస్యంగా రిలీజ్ అవుతోంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గోపి గణేష్ ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ మధ్యలోనే ఆయన లేచి వెళ్లిపోవడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ను టార్గెట్ చేసేలా ఉన్నాయి. ఇదే విషయాన్ని యాంకర్.. దర్శకుడి వద్ద ప్రస్తావించారు. ఈ క్రమంలో ‘మీకు కొందరు రాజకీయ నేతల నుంచి బెదిరింపులు వచ్చాయట..

నిజమేనా..?’ అని ప్రశ్నించగా.. దానికి గోపి గణేష్.. ‘నేను సిన్సియర్ గా ఒక సినిమా తీశాను, దాని మీద కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. నన్ను బెదిరించినట్లుగా మీకెవరు చెప్పారు.. మీ మాటలు చూస్తుంటే అధికార పార్టీకి అమ్ముడుపోయినట్లుగా అనిపిస్తోంది’ అని అన్నారు. దీనికి యాంకర్ బదులిస్తూ.. మీరు ప్రతిపక్ష పార్టీకి అమ్ముడుపోయినట్లు అనిపిస్తోందని అన్నారు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గోపి గణేష్ స్టూడియో నుంచి వెళ్లిపోవాలనుకున్నారు.

అయితే యాంకర్ అతడికి సర్ది చెప్పి కొన్ని నిమిషాల తరువాత ఇంటర్వ్యూ కొనసాగేలా చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే ఇది సినిమాపై బజ్ క్రియేట్ చేయడానికి ఇలా గొడవ పడినట్లు డ్రామా చేశారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus