Godzilla vs Kong Trailer: ‘గాడ్జిల్లా x కాంగ్ పోరు… కొత్త ట్రైలర్‌ చూశారా? వామ్మో ఇంతలానా?

హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ప్రపంచమంతా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఎక్కడివారైనా ఆ సినిమాలు వస్తే చూడటానికి సిద్ధమైపోతారు. అందులోనూ కొన్ని సిరీస్‌ల సినిమాలు అయితే ఇక చెప్పక్కర్లేదు. అలాంటి వాటిలో మాన్‌స్టర్‌ సినిమాలు కూడా ఉన్నాయి. అలా విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న మాన్‌స్టర్ సినిమాల్లో ‘గాడ్జిల్లా x కాంగ్’ ఒకటి. ఈ మాన్‌స్టర్ యూనివర్స్ నుండి ఇప్పటికే నాలుగు సినిమాలు రాగా.. ఐదో సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది.

‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ పేరుతో ఈ సిరీస్‌లో ఐదో సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయగా… భారీ రికార్డు వ్యూస్‌ అందుకుంది. ఇప్పుడు ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడానికి కొత్త ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ వాళ్లు. మూడు నిమిషాలకుపైగా నిడివి ఉన్న ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ కొత్త ట్రైలర్ అదిరిపోయింది అని అంటున్నారు నెటిజన్లు.

2021లో వచ్చిన ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ చిత్రానికి ఇది సీక్వెల్‌. మూడేళ్ల నుండి ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్‌లో గాడ్జిల్లా, కాంగ్‌తో పాటు కొందరు నటీనటులూ కనిపించారు. ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ సినిమాను మార్చిలో విడుదల చేస్తారు. గాడ్జిల్లా, కాంగ్ ఎవరు హీరో? ఎవరు, విలన్ ఎవరు అనే చర్చ చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు సినిమా కొత్త పార్టు వస్తుండటంతో మళ్లీ ఆ చర్చ మొదలైంది.

మార్చి 29న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. (Godzilla vs Kong) ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’లో గాడ్జిల్లాకు, కాంగ్‌కు మధ్య యుద్ధం జరగగా.. ఈ సారి ఆ రెండు మాన్‌స్టర్స్ కలసి మరో మాన్‌స్టర్‌పై యుద్ధం చేయనున్నాయి. గాడ్జిల్లా, కాంగ్ మధ్య వచ్చే ఫైట్ సీన్స్ విజువల్‌ అదిరిపోతాయి అంటున్నారు. మరి ఈ రెండు మాన్‌స్టర్స్‌ ఎంతవరకు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటాయో చూడాలి.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus