తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly).’మార్క్ ఆంటోనీ’ (Mark Antony) ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్(Adhik Ravichandran) దర్శకత్వం వహించిన ఈ సినిమాని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ‘మైత్రి మూవీ మేకర్స్’ అధినేతలు అయిన నవీన్ ఎర్నేని(Naveen Yerneni), వై.రవి శంకర్ (Y .Ravi Shankar)..లు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 10న అంటే నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. మొదటి షోతోనే సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది.
అజిత్ ఫ్యాన్స్ కి కావాల్సిన అంశాలు ఇందులో ఉండటంతో అభిమానులు థియేటర్లలో తెగ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను సాధించింది ఈ సినిమా. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.48 cr |
సీడెడ్ | 0.27 cr |
ఆంధ్ర | 0.39 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.14 cr |
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.5.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా రూ.1.14 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.1.82 కోట్లు కలెక్ట్ చేసింది. సో బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.4.36 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. శని, ఆదివారాల్లో కూడా ఈ సినిమా బాగా కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గ్యారెంటీ అనే చెప్పాలి.