తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కు (Ajith Kumar) తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత 5 ఏళ్లుగా ఆయన నటించిన తమిళ సినిమాలు ఏకకాలంలో తెలుగులో కూడా డబ్ అయ్యి రిలీజ్ అవుతున్నాయి. కోవిడ్ కి ముందు ‘విశ్వాసం’ తో (Viswasam) ఇండస్ట్రీ హిట్ కొట్టిన అజిత్… ఆ తర్వాత ‘నెర్కొండ పార్వై’ తో మరో సూపర్ హిట్ కొట్టాడు. కానీ కోవిడ్ తర్వాత ఒక్క హిట్టు కూడా కొట్టలేక సతమతమవుతున్నారు. ‘వలీమై’ ‘విదాముయర్చి'(పట్టుదల) (Pattudala) సినిమాలు ఎపిక్ డిజాస్టర్స్ గా మిగిలాయి.
మధ్యలో వచ్చిన ‘తునీవు'(తెలుగులో ‘తెగింపు’) కమర్షియల్ గా ఓకే అనిపించింది. కానీ కంటెంట్ తో ఆడియన్స్ ని మెప్పించలేదు. సో ఇప్పుడు అజిత్ ఫ్యాన్స్ చూపు అంతా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly)పైనే ఉంది. విశాల్ తో (Vishal) ‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony) అనే సినిమా తీసి హిట్టు కొట్టి రూ.100 కోట్ల క్లబ్లో చేరిన అధిక రవిచంద్రన్ (Adhik Ravichandran) దీనికి దర్శకుడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని (Naveen Yerneni), వై.రవి శంకర్ (Y .Ravi Shankar)..లు కలిసి ఈ సినిమాను నిర్మించారు.
దీంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. తమిళంలో కొంతమంది ప్రముఖులకు ఈ సినిమా స్పెషల్ షో వేయడం జరిగింది. సినిమా చూసిన అనంతరం తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు సినిమా చూసిన వాళ్ళు. వారి టాక్ ప్రకారం సినిమా.. 2 గంటల 20 నిడివి కలిగి ఉందట. కుటుంబం కోసం వయొలెన్స్ కి దూరంగా ఉన్న ఎకె(అజిత్) జీవితంలోకి ఓ యంగ్ విలన్(అర్జున్ దాస్) వస్తాడు.
అతని వల్ల ఏకె కి అలాగే అతని ఫ్యామిలీకి వచ్చిన సమస్యలు ఏంటి? అనేది మెయిన్ స్టోరీ అని అంటున్నారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లో యాక్షన్, కామెడీ సమాంతరంగా ఉంటుందట. తమిళంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అయిన రెఫరెన్సులు అన్నీ ఈ సినిమాలో ఉంటాయట. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉంటాయట. మరి రిలీజ్ రోజున మార్నింగ్ షోల నుండి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.