Dhanush , Aiswarya: విడాకుల తర్వాత తొలిసారి కలిసిన ధనుష్ ఐశ్వర్య.. ఎందుకంటే?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు తమిళనాడులో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ధనుష్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ధనుష్ ఐశ్వర్య కొన్ని నెలల క్రితం విడిపోయారనే సంగతి తెలిసిందే. ధనుష్, ఐశ్వర్య విడిపోవడం అభిమానులను ఎంతగానో బాధపెట్టింది. అయితే ధనుష్ ఐశ్వర్య విడిపోయిన తర్వాత కలిసి ఎక్కడా కనిపించలేదనే సంగతి తెలిసిందే. ఒకే చోట ధనుష్ ఐశ్వర్య సినిమాల షూటింగ్ లు వేర్వేరుగా జరిగినా కూడా వీళ్లిద్దరూ కలిసి కనిపించలేదు.

అయితే విడాకుల తర్వాత ధనుష్ ఐశ్వర్య తొలిసారి కలిసి కనిపించడం గమనార్హం. ధనుష్ ఐశ్వర్యల పెద్ద కొడుకు యాత్ర స్కూల్ లో ఒక కార్యక్రమం జరగగా ఆ కార్యక్రమానికి వీళ్లిద్దరూ కలిసి హాజరు కావడం గమనార్హం. ఐశ్వర్య సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయడంతో పాటు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఎంత బాగా మొదలైందో.. నా పెద్ద కొడుకు యాత్ర స్పోర్ట్స్ కెప్టెన్ గా ఎంపికయ్యాడని ఐశ్వర్య వెల్లడించారు.

ధనుష్, ఐశ్వర్య, పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను ఐశ్వర్య ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ధనుష్ ఐశ్వర్య జంట చూడముచ్చటగా ఉన్నారని వాళ్లిద్దరూ కలిసి సంతోషంగా జీవనం సాగిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ధనుష్ నటుడిగా కెరీర్ పరంగా బిజీగా ఉండగా ఐశ్వర్య రజనీకాంత్ మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకురాలిగా కెరీర్ ను మొదలుపెట్టడానికి సిద్ధమయ్యారు.

ఓ సాథీ చల్ అనే లవ్ స్టోరీని హిందీలో ఆమె డైరెక్ట్ చేస్తున్నారు. ధనుష్, ఐశ్వర్య కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని వాళ్ల అభిమానులు కోరుకుంటున్నారు. ధనుష్, ఐశ్వర్యలకు సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ధనుష్ ఐశ్వర్య కెరీర్ విషయంలో ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది. తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా వీళ్లిద్దరికీ ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus