Prabhas: సలార్ టీజర్, ఆదిపురుష్ ట్రైలర్ రిలీజయ్యేది అప్పుడేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండగా ఆదిపురుష్, సలార్ సినిమాలు వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానున్నాయి. అయితే ఈ రెండు సినిమాల మేకర్స్ సినిమాల ప్రమోషన్స్ విషయంలో, ఈ రెండు సినిమాల అప్ డేట్ల విషయంలో సైలెంట్ గా ఉన్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆదిపురుష్ టీజర్ ఆగష్టు నెల 15వ తేదీన రిలీజ్ కానుంది.

అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు కాగా ఆరోజు సలార్ సినిమా నుంచి టీజర్, ఆదిపురుష్ సినిమా నుంచి ట్రైలర్ విడుదల కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఫస్టాఫ్ లోనే ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని తెలుస్తోంది.

ప్రభాస్ సినిమాల టీజర్లు, ట్రైలర్ రిలీజ్ కావడానికి చాలా సమయం ఉన్నా ప్రభాస్ పుట్టినరోజు కానుకగా అప్ డేట్స్ వస్తాయనే వార్త ప్రభాస్ ఫ్యాన్స్ లో సంతోషానికి కారణమవుతోంది. ప్రభాస్ వేగంగా సినిమాలలో నటించడంతో పాటు విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 2023 సంవత్సరం ప్రభాస్ దే అని సలార్ ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రభాస్ ఈ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. ప్రభాస్ కు భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు పూర్తయ్యే వరకు ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వరని తెలుస్తోంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus