Samantha: ఆ చికిత్స వల్ల సమంత సమస్య తగ్గినట్టేనా?

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయొసైటిస్ వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం యశోద ప్రమోషన్స్ లో భాగంగా సమంత తన ఆరోగ్య సమస్య గురించి వెల్లడించారు. సమంత ఈ విషయాలను చెప్పిన వెంటనే సామ్ అభిమానులు బాధ పడటంతో పాటు సమంత త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేశారు. అయితే సమంత ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగుపడిందని తెలుస్తోంది. ఆయుర్వేద చికిత్స చేయించుకుంటున్న సమంత మునుపటితో పోలిస్తే బాగానే ఉన్నారని సమాచారం.

త్వరలో ప్రేక్షకులు పాత సమంతను చూస్తారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సమంత కోలుకుంటున్నారనే వార్త ఫ్యాన్స్ కు సైతం ఆనందాన్ని కలిగిస్తోంది. యశోద సినిమాతో సక్సెస్ ను అందుకున్న సమంత త్వరలో శాకుంతలం, ఖుషి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శాకుంతలం సినిమా షూట్ ఇప్పటికే పూర్తి కాగా ఖుషి సినిమా షూటింగ్ సమంత వల్ల వాయిదా పడింది. సమంత ఆరోగ్య సమస్య నుంచి కోలుకున్న తర్వాతే ఈ సినిమా షూట్ లో పాల్గొనున్నారు.

ఖుషి మూవీ వచ్చే ఏడాదికి వాయిదా పడిందని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఖుషి మూవీపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఖుషి మూవీ కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ఖుషి మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండకు సైతం ఈ సినిమా సక్సెస్ కీలకమనే సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రేజ్ ఉన్న దర్శకులకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

గత సినిమాల ఫలితాల నేపథ్యంలో విజయ్ దేవరకొండ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమంత ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్ట్ కు 3 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు. బాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉండటంతో సమంత ఈ స్థాయిలో పారితోషికం డిమాండ్ చేస్తున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus