Chiru, Balayya: చిరంజీవి, బాలయ్య అభిమానులకు శుభవార్త.. కానీ?

2023 సంక్రాంతి పండుగ కానుకగా విడుదలవుతున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఆ అప్ డేట్ క్షణాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య సినిమాకు దేవిశ్రీ ప్రసాద్, వీరసింహారెడ్డి సినిమాకు థమన్ తమ వంతుగా బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడానికి ఎంతో కష్టపడ్డారని ఇప్పటికే విడుదలైన ఈ సినిమాల పాటల ద్వారా క్లారిటీ వచ్చిందనే సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్ కోసం ఇద్దరు హీరోల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ నెల 29వ తేదీన ఓవర్సీస్ ఆడియన్స్ కు టికెట్లు అందుబాటులోకి రానున్నాయని బోగట్టా. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు మాత్రం జనవరి ఫస్ట్ వీక్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకానున్నాయని సమాచారం అందుతోంది. ఓవర్సీస్ బుకింగ్స్ కు సంబంధించి ఇప్పటికే అప్ డేట్ వచ్చింది. సాధారణంగా చిరంజీవి సినిమాలు ఓవర్సీస్ లో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటాయి. అఖండ సినిమాతో బాలయ్య ఓవర్సీస్ మార్కెట్ కూడా ఊహించని స్థాయిలో పెరిగింది.

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఓవర్సీస్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవికి ప్రస్తుతం సక్సెస్ అవసరం కాగా అఖండ క్రేజ్ ను వీరసింహారెడ్డితో బాలయ్య కంటిన్యూ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఈ ఇద్దరు హీరోలు సక్సెస్ ను సాధించి కెరీర్ హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేయాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఏ స్థాయిలో సక్సెస్ సాధిస్తాయో చూడాల్సి ఉంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus