Prabhas: సలార్ మూవీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. క్లారిటీ రావడంతో?

కొన్ని కాంబినేషన్లలో సినిమా అంటే రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తారు. విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సినిమాలలో సలార్ సినిమా ఒకటి. ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ప్రభాస్ ను కొత్తగా చూపించనున్నారని ప్రభాస్ కు ఈ సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ను సంతోషపరిచేలా ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ వచ్చాయి.

సలార్ మూవీ ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదూర్ మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించిన షాకింగ్ విషయాలను వెల్లడించారు. సలార్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో ఇదే తొలి సినిమా కాగా ప్రభాస్, శృతి జోడీకి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడతాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మాస్ ప్రేక్షకులకు నచ్చే సన్నివేశాలు ఈ సినిమాలో ఎక్కువగానే ఉన్నాయని సమాచారం.

ఇప్పటికే సలార్ రిలీజ్ డేట్ ఒకసారి మారగా ఈసారి రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని సలార్ నిర్మాత విజయ్ కిరంగదూర్ తేల్చి చెప్పారు. సలార్ మూవీ షూటింగ్ 85 శాతం పూర్తైందని విజయ్ కిరంగదూర్ తెలిపారు. జనవరిలోగా ఈ సినిమా షూట్ పూర్తవుతుందని ఆయన అన్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసమే ఆరు నెలల సమయం కేటాయించామని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

విజువల్ ఎఫెక్ట్స్ పనులను పూర్తి చేసి ఈ సినిమాను అనుకున్న విధంగా విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన రెండు సినిమాలు లేదా మూడు సినిమాలు థియేటర్లలో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలయ్యేలా ప్రభాస్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus