Meetha Raghunath: ఘనంగా ‘గుడ్ నైట్’ హీరోయిన్ పెళ్లి.. ఫోటోతో క్లారిటీ

సమ్మర్ వచ్చింది అంటే పెళ్లిళ్ల సీజన్ వచ్చినట్టే..! రాబోయే రెండు నెలల్లో కూడా పెళ్లిళ్లు ఎక్కువగానే జరగనున్నాయి అని తెలుస్తుంది. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వరుసగా పెళ్లిపీటలెక్కుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే దిల్ రాజు (Dil Raju) తమ్ముడి కొడుకు ఆశిష్, నితిన్ (Nithiin) ‘ఎక్స్ట్రా’ (Extra: Ordinary Man) సినిమాలో విలన్ గా చేసిన సుదేవ్ నాయర్(Sudhev Nair)  ,స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), సీనియర్ హీరోయిన్ అక్ష(Aksha Pardasany), బిగ్ బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్(Vasanthi Krishnan),, హీరోయిన్ మీరా చోప్రా(Meera Chopra) , సింగర్ హారికా నారాయణ్ (Harika Narayan) వంటి వారు పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు.

తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ కి (Varalaxmi Sarathkumar) కూడా పెళ్లి ఫిక్స్ అయ్యింది. అలాగే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కూడా హీరోయిన్ రహస్యతో (Rahasya Gorak) ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ యంగ్ హీరోయిన్ మీతా రఘునాథ్ (Meetha Raghunath) పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. నిన్న మార్చి 17 న అనగా ఆదివారం నాడు మీతా పెళ్లి పీటలెక్కింది.

ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మీతా వివాహం ఘనంగా జరిగింది. పెద్దలు చూసిన అబ్బాయినే మీతా పెళ్లి చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. ‘ముత్తుల నీ నిధూమ్ నీ’ అనే సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మీతా ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. గత ఏడాది రిలీజ్ అయిన ‘గుడ్ నైట్’ సినిమా ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక మీతా పెళ్ళి ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus