RRR Movie: ఓసారి గూగుల్‌లో RRR అని టైప్‌ చేసి చూద్దురు!

భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ‘ఆర్ఆర్ఆర్‌’ తీసుకొచ్చిన మార్పు ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే పేజీలు పేజీలు రాసినా సరిపోదు. థియేటర్లలో విడుదలైనప్పుడు అక్కడక్కడా చిన్న నెగిటివిటీ కనిపించినా.. ఆ తర్వాత ఓటీటీల్లోకి సినిమా వచ్చేసరికి ఎక్కడలేని స్పందన కనిపించింది. ప్రపంచప్రఖ్యాత నిపుణులు కూడా ఈ సినిమాను తెగ మెచ్చుకున్నారు. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌, అభిమానుల కోసం గూగుల్‌ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. దీన్ని చూసి ‘ఆర్ఆర్ఆర్‌’ అభిమానులు మురిసిపోతున్నారు.

‘ఆర్ఆర్‌ఆర్’ సినిమాను చూసి అందరూ మెచ్చుకుంటూ ఉంటే గూగుల్‌ కూడా ఎందుకు ఊరుకుంటుంది. తనదైన శైలిలో టీమ్‌కి ప్రేమను పంచింది. దీంతో #RRRTakeOver అనే హ్యాష్‌ ట్యాగ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ సర్‌ ప్రైజ్‌ మాటల్లో చెప్పడం కంటే చూడటమే బాగుంటుంది. ఓసారి బ్రౌజర్‌లో వేరే ట్యాబ్‌ తీసుకొని గూగుల్‌లోకి వెళ్లి RRR లేదా rrr లేదా ఆర్‌ఆర్‌ఆర్‌ అని ఎలా అయినా టైప్‌ చేసి చూడండి. మీకే అర్థమవుతోంది.

ఏంటి.. ట్రై చేశారా! అదిరిపోయింది కదా గూగుల్‌ కాన్సెప్ట్‌. సెర్చ్‌ రిజల్ట్స్‌ టాప్‌లో ఓ గుర్రం, బైక్‌ అలా వెళ్తూ ఉంటాయి. సినిమాలో రామ్‌చరణ్‌ గుర్రం మీద వెళ్లడం, తారక్‌ బైక్‌ మీద వెళ్లడం గురించి తెలిసిందే. సినిమా ప్రచారం తొలినాళ్లలో బైక్‌ – హార్స్‌ ఫొటో బాగా వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు గూగుల్‌ వాటిని తీసుకునే టీమ్‌ను కంగ్రాట్యులేట్‌ చేసింది. ఆ వీడియోను ‘ఆర్ఆర్‌ఆర్‌’ టీమ్‌ సోషల్‌ మీడియాలో పెడుతూ #RRRTakeOver అనే హ్యాష్‌ ట్యాగ్‌ ఇచ్చింది. అభిమానులు కూడా ఈ ట్యాగ్‌తో స్క్రీన్‌ రికార్డు, ఫొటోను షేర్‌ చేయమని అడిగింది.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లు వసూలు చేసి అదరగొట్టింది. త్వరలో జపాన్‌లో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దీంతో ఆ వసూళ్ల నెంబరు పెరిగే అవకాశం ఉంది. మరి చైనాలోనూ సినిమా విడుదల చేస్తారా లేదా అని చూడాలి. అక్కడ చేస్తే దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘దంగల్‌’ (₹2024 కోట్లు)ను దాటేసే అవకాశం ఉంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus