గోపీచంద్ హీరోగా నటించిన లక్ష్యం లౌక్యం సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించినటువంటి శ్రీ వాస్ తాజాగా గోపీచంద్ డింపుల్ హైయతి హీరో హీరోయిన్లుగా రామబాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మే 5వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ తేజతో కలిసి గోపీచంద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా తేజ అడిగిన ప్రశ్నలకు గోపీచంద్ తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో గోపీచంద్ కు డైరెక్టర్ కు మధ్య గొడవలు తలెత్తాయని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయం గురించి తేజ గోపీచంద్ ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు గోపీచంద్ సమాధానం చెబుతూ మా మధ్య ఏ విధమైనటువంటి గొడవలు లేవని తెలిపారు. సినిమా షూటింగ్ చేసే సమయంలో కొన్ని సీన్ల నిడివి చాలా ఎక్కువగా ఉంది. ఇంతనిడివి అవసరం లేదని డైరెక్టర్ కి చెప్పాను.
ఈ మాటకు శ్రీవాస్ పర్లేదు ఉండనివ్వు ఒకవేళ అవసరమైతే అప్పటికప్పుడు చేయలేము కదా అని ఆ సన్నివేశాలను అలాగే పెట్టారు.ఇక నేను కూడా దాని గురించి పెద్దగా మాట్లాడలేదు అయితే తీరా ఈ సినిమా ఎడిటర్ వద్దకు వెళ్ళగానే ఆ సన్నివేశాలు అన్నింటిని ఎడిట్ చేశారు. ఇంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని,ఈ విషయాన్ని మా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నట్టు రాయడంతో ఇది కాస్త సంచలనంగా మారిందని గోపీచంద్ తెలిపారు.
ఇక తన (Gopichand) వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ తనకు ఏది తోస్తే అదే చెప్పేస్తానని,తన మాటలు అవతల వ్యక్తి వింటే ఓకే లేదంటే పెద్దగా పట్టించుకోనని తెలిపారు అంతేకాకుండా తనకు ఎదుట వ్యక్తులను బాధ పెట్టడం ఏమాత్రం ఇష్టం ఉండదని గోపీచంద్ తెలిపారు.ఇక సినిమా అంటే కేవలం ఒక వ్యక్తి పైన ఆధారపడి ఉండదు అందరూ కలిసి తీసుకునే నిర్ణయం అయితే అందులో నిజం ఉంటే తాను కూడా ఆ విషయాలను అంగీకరిస్తానని ఈ సందర్భంగా గోపీచంద్ తెలిపారు.