Balakrishna: అలాగే సినిమా తీయాలంటే.. మళ్లీ మీరెందుకు..!

NBK107.. ఈ సినిమా మొదలైనప్పటి నుండి ఇది గోపీచంద్‌ మలినేని సినిమానా, బోయపాటి శ్రీను సినిమా అనే ప్రశ్న సెటైరికల్‌గా వినిపిస్తోంది. కారణం ఈ సినిమా లుక్‌, స్టైల్‌ అంతా బోయపాటి సినిమాలానే ఉన్నాయి. అదంతా ఒకెత్తెయితే సినిమా ప్రచార శైలి విషయంలో కూడా ‘అఖండ’ స్టైల్‌నే వాడేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఈ విషయం గురించి మనం చూశాం. సినిమా పేరు చెప్పకుండా సినిమా నెంబరు చెప్పుకుంటూనో, షార్ట్‌ఫామ్‌ను చెప్పుకుంటూనో ప్రచారం చేశారు.

ఇప్పుడు బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా సినిమాకు సంబంధించి ఓ గ్లింప్స్‌ వీడియోను విడుదల చేశారు. పేరు ఏదైనా దానిని ట్రైలర్‌ అని అనొచ్చు. అందులో బాలయ్య నోట నుండి మూడు డైలాగ్‌లు వచ్చాయి. దాంతోపాటు నాలుగు ఎలివేషన్ సీన్లు, ఓ ఐదు డ్రోన్ షాట్లు, పొలిటికల్‌ పంచ్‌లు ఉన్నాయి. అయితే ఇప్పుడు #BB3FirstRoar పేరుతో ‘అఖండ’కి సంబంధించి ఓ టీజర్‌ విడుదల చేశారు. కరోనాకు ముందు వచ్చిన ఆ టీజర్‌కి మంచి బజ్‌ వచ్చింది.

ఈ రెండూ చూశాక మలినేని మక్కీకి మక్కీ అదే దింపేశారు అనే ఫీల్‌ వస్తుంది కదా. మరి కావాలని అలా చేశారో, అదే సినిమాలో చెప్పినట్లు ‘యాజ్‌ ఇట్‌ ఈజ్‌’గా ఉండాలని చేశారో కానీ. రెండింటి కాన్సెప్ట్‌ ఒకటే. సినిమాకు టైటిల్‌ పెట్టకుండా టీజర్‌లు రిలీజ్‌ చేసి హైప్‌ పెంచుదాం అనుకుంటున్నారా? లేక ‘అఖండ’ను ఫాలో అవుదాం అనుకుంటున్నారా అనేది మీకే అర్థమైపోతుంది. రెండు సినిమాల కథలు వేరే అవ్వొచ్చు, నేపథ్యాలు వేరే అవ్వొచ్చు కానీ ప్రచారం ఒకేలా ఉంటే ఎలా.

అలాంటి సినిమానే, అలాంటి ప్రచారమే చేయాలంటే మళ్లీ కొత్తగా నిర్మాణ సంస్థ డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు? పాత ట్రైలర్‌, టీజర్లనే చూపించుకుంటే సరిపోతుంది కదా. ఎలాగూ ఆ టీజర్‌లో పేరు లేదు, ఈ టీజర్‌లో పేరు లేదు. ఇవన్నీ వినడానికి హార్ష్‌గా ఉండొచ్చు కానీ… ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే సినిమా ఇస్తామని చెప్పిన, పాత సినిమా స్టైల్‌లో వస్తే ఎలా? అని సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus