Pawan Kalyan: ‘భీమ్లా’ మిస్‌ అయ్యింది.. ఈసారి పెద్ద సినిమానే చేస్తా!

‘క్రాక్‌’ సినిమాకు ‘వీర సింహా రెడ్డి’కి మధ్య కొన్నాళ్లు గ్యాప్‌ వచ్చింది. ఈ సమయంలో గోపీచంద్‌ మలినేని ఇతర హీరోలతో సినిమాలు చేయడానికి ప్లాన్స్‌ వేశారు. అయితే అవేవీ వర్కౌట్‌ కాలేదు. ఎందుకు కాలేదు అనేది వేరే విషయం అనుకోండది. అలా గోపీచంద్‌ మలినేని అనుకున్న సినిమాల్లో పవన్‌ కల్యాణ్ సినిమా కూడా ఉందట. ఈ విషయన్నే గోపీచంద్‌ మలినేనినే చెప్పుకొచ్చారు. ‘వీర సింహా రెడ్డి’ సినిమా విజయం నేపథ్యంలో గోపీచంద్‌ వివిధ యూట్యూబ్‌ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఈ క్రమంలో ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో మాట్లాడుతూ ‘‘భీమ్లా నాయక్‌’ సినిమా చేసే అవకాశం తొలుత తనకు వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఎప్పటికైనా పవన్‌ కల్యాణ్‌తో ఓ సినిమా చేస్తాను. దాని కోసం పవర్‌ఫుల్‌ కథ సిద్ధం చేశాను’’ అని గోపీచంద్‌ మలినేని చెప్పుకొచ్చారు. గతంలో అవకాశం మిస్‌ అయినా.. ఈసారి పక్కాగా చేస్తానని చెబుతున్నారు. అయితే ఇప్పటికప్పుడు పవన్‌ మరో సినిమా చేసే పరిస్థితి లేదు.

కాబట్టి ఇంత త్వరగా వీలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అంతేనా.. మరి హెడ్డింగ్‌లో బక్క రవితేజ అన్నారేంటి? అనేగా మీ ప్రశ్న. దీని వెనుక పెద్ద కథే ఉంది. గోపీచంద్‌ గతంలో చిరంజీవి సినిమాకు అసోసియేట్‌గా పని చేశారు. ఆ సమయంలో చిరంజీవి ఓసారి రిస్ట్‌ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి, నీ టైమ్‌ బాగుంటుంది అని అని అన్నారట. అలాగే ఆ సినిమా సెట్స్‌లో గోపీచంద్‌ను చిరంజీవి ‘బక్క రవితేజ’ అని పిలిచేవారట.

ఓ యాంగిల్‌లో గోపీచంద్‌ను చూస్తే రవితేజ లాగే ఉంటారు అని చాలామంది అంటుంటారు. అప్పుడు చిరంజీవి కూడా అలానే అనుకున్నారేమో. అన్నట్లు పవన్‌ కల్యాణ్‌ అంటే తనకు చాలా ఇష్టమని గతంలో అంటే తొమ్మిదేళ్ల క్రితం ఓసారి గోపీచంద్‌ చెప్పిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మరి ఎప్పుడు సినిమా అనేది చూడాలి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus