ఎన్టీఆర్ హిట్ మూవీని తలపిస్తున్న గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ స్టోరీ లైన్..!

యాక్షన్ హీరో గోపీచంద్ ఇప్పుడు ఎలాగైనా హిట్టు కొట్టి తిరిగి ఫామ్లోకి రావాలని తెగ ట్రై చేస్తున్నాడు. గతంలో ఇతను మినిమం గ్యారెంటీ హీరోగా రాణించేవాడు. అయితే ఇప్పుడు యంగ్ హీరోల దాటికి.. సరైన హిట్టు కొట్టలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో సంపత్ నంది డైరెక్షన్లో ‘సీటిమార్’ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. అది ఈ ఏడాదే విడుదల కాబోతుంది.తరువాత మారుతీ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి రెడీ అయ్యాడు. ‘పక్కా కమర్షియల్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, బన్నీ వాస్ లు కలిసి నిర్మిస్తున్నారు.

ఈ మధ్యనే ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఈ చిత్రంలో లాయర్ పాత్రలో గోపీచంద్ కనిపించబోతున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం స్టోరీ లైన్ ఎన్టీఆర్ ‘టెంపర్’ కు దగ్గరగా ఉంటుందని ఇన్సైడ్ టాక్. ‘టెంపర్’ కథ ప్రకారం… డబ్బు కోసం ఎంతటి అవినీతికైనా పాల్పడే ఓ హీరో.. తన కారణంగా అత్యాచారానికి గురయ్యి ప్రాణాలు కోల్పోయే యువతి కోసం.. నిజాయితీగా మారతాడు. దర్శకుడు పూరి జగన్నాథ్ డైరెక్షన్ ఆ చిత్రానికి పెద్ద ప్లస్. ఇదే లైన్ తో అంతకు ముందు ‘పటాస్’ సినిమా కూడా వచ్చింది. ఇదిలా ఉండగా..

‘పక్కా కమర్షియల్’ చిత్రం కథ ప్రకారం.. డబ్బు కోసం ఎలాంటి నేరస్థులను అయినా తన వాదనతో కేసుని గెలిపించే ఓ హీరో.. చివరికి తన కారణంగా అన్యాయమైపోయిన ఓ కుటుంబం కోసం మారతాడు. చివరికి నిజాయితీగా మారి ఆ కుంభాన్ని గెలిపిస్తాడు. అయితే ఫస్ట్ హాఫ్ నుండీ క్లైమాక్స్ వరకూ ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ కామెడీతో ఉంటుందట. క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్ గా సాగుతుందని తెలుస్తుంది. మరి ఈ ప్రచారంలో ఎంతవరకూ నిజముందో అక్టోబర్ నెల వస్తే కానీ చెప్పలేము.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus