Ramabanam OTT: గోపీచంద్ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన గోపీచంద్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అయితే ఈ మధ్య కాలంలో గోపీచంద్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో ఫెయిలవుతున్నాయి. రామబాణం సినిమాతో గోపీచంద్ కు భారీ షాక్ తగిలింది. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. విడుదలైన చాలా నెలల తర్వాత రామబాణం మూవీ ఓటీటీలో రిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

ఈ నెల 14వ తేదీన తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో (Ramabanam) ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. రామబాణం మూవీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఈ సినిమా ఫెయిలైంది. శ్రీవాస్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా రొటీన్ కథతో తెరకెక్కడం వల్ల ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. రామబాణం సినిమా మంచి ఫలితాన్ని సొంతం చేసుకోకపోవడంతో శ్రీవాస్ కు కొత్త సినిమా ఆఫర్లు రావడం కష్టమవుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గోపీచంద్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీ అవుతున్నారు. గోపీచంద్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గోపీచంద్ ప్రస్తుతం సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గోపీచంద్ కథ అద్భుతంగా ఉంటే మల్టీస్టారర్ సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

గోపీచంద్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవడంతో పాటు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే భారీ విజయాలను సొంతం చేసుకోవడం ఖాయమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోపీచంద్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus