Gopichand: ఆ టైటిల్ తో గోపీచంద్ కు బ్లాక్ బస్టర్ కు దక్కుతుందా?

అన్ స్టాపబుల్ సీజన్2 ఎపిసోడ్6 కు ప్రభాస్, గోపీచంద్ గెస్ట్ లుగా హాజరు కాగా త్వరలో ఈ ఎపిసోడ్ బుల్లితెరపై ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేని గోపీచంద్ ప్రస్తుతం శ్రీవాస్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. రామబాణం అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. అన్ స్టాపబుల్2 షోలో గోపీచంద్ ఈ విషయాన్ని రివీల్ చేశారని సమాచారం అందుతోంది.

గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది. భారీ బడ్జెట్ తోనే రామబాణం మూవీ తెరకెక్కుతుండగా ఈ సినిమాలో మెసేజ్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కు కూడా ప్రాధాన్యత ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన పీపుల్స్ మీడియా బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

లక్ష్యం, లౌక్యం సినిమాల తర్వాత గోపీచంద్ శ్రీవాస్ కాంబో మూవీ కావడంతో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. భూపతి రాజా ఈ సినిమాకు కథ అందించగా డింపుల్ హయాతి ఈ సినిమాలో నటిస్తున్నారు. గోపీచంద్ కొత్త తరహా కథలను ఎంచుకుంటున్నా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమాలు సక్సెస్ సాధించలేదు. గోపీచంద్ ప్రస్తుతం 5 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు.

అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్, గోపీచంద్ తమకు సంబంధించిన ఎన్నో రహస్యాలను రివీల్ చేశారని తెలుస్తోంది. ప్రభాస్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలలో ఎన్నో విషయాలు ఈ షో ద్వారా రివీల్ అయ్యాయని సమాచారం. వరుస సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్న ప్రభాస్ బాలయ్యపై ఉన్న గౌరవం వల్ల ఈ షోకు హాజరయ్యారని బోగట్టా. ఈ ఎపిసోడ్ తో వ్యూస్ విషయంలో క్రియేట్ అయిన రికార్డులు చెరిగిపోయి కొత్త రికార్డులు నమోదవుతాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus