శ్రీరామనవమి సందర్భంగా గోపీచంద్ ‘ఆక్సిజన్’ ఫస్ట్ లుక్ విడుదల

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం ‘ఆక్సిజన్‌’. శ్రీరామనవమి సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేశారు. ఈసందర్భంగా …
నిర్మాతఎస్.ఐశ్వర్య మాట్లాడుతూ ‘’యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా మా బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఆక్సిజన్ చిత్రం ఇప్పటికి మూడు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. డిఫరెంట్ సబ్జెక్ట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు హైలైట్ గా నిలవనుంది. సినిమా శరవేగంగా చిత్రీకరణను జరపుకుంటుంది. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ తో గోపీచంద్ బాడీలాంగ్వేజ్ కు తగిన కథను జ్యోతికృష్ణగారు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. గోపీచంద్ ను సరికొత్తగా ప్రెజంట్ చేస్తున్నారు. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం’’ అన్నారు.
గోపీచంద్‌, జగపతిబాబు, రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్, ,కిక్‌ శ్యామ్‌, ఆలీ, బ్రహ్మజీ, సితార, అభిమన్యుసింగ్, షాయాజీ షిండే, చంద్రమోహన్, సుధ, ప్రభాకర్, అమిత్, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: వెట్రి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఫైట్స్‌:పీటర్ హెయిన్, ఆర్ట్‌: మిలన్‌, నిర్మాత: ఎస్‌.ఐశ్వర్య, దర్శకత్వం: ఎ.ఎం.జోతికృష్ణ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus