Viswam First Review: గోపీచంద్ ‘విశ్వం’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
- October 10, 2024 / 10:23 AM ISTByFilmy Focus
మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) , సీనియర్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల (Srinu Vaitla) కాంబినేషన్లో ‘విశ్వం'(Viswam) అనే సినిమా రూపొందింది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) ఈ చిత్రాన్ని నిర్మించారు. కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్ గా నటించింది. సీనియర్ నరేష్ (Naresh) , వెన్నెల కిషోర్ (Vennela Kishore) , సునీల్ (Sunil) ,పృథ్వీరాజ్ (Prudhvi Raj), ముఖేష్ రుషి (Mukesh Rishi) , అజయ్ ఘోష్ (Ajay Ghosh), వీటీవి గణేష్ (VTV Ganesh) వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్స్ ఇంప్రెస్ చేశాయి. చేతన్ భరద్వాజ్ సంగీతంలో రూపొందిన పాటలు కూడా బాగానే ఉన్నాయి.
Viswam First Review

‘విశ్వం’ టీం ఈ సినిమా సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ముఖ్యంగా హీరో గోపీచంద్ కచ్చితంగా ఇది దర్శకుడు శ్రీను వైట్లకి కంబ్యాక్ మూవీ అవుతుంది అనే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఇండస్ట్రీలో కొంత మంది జనాలు ఈ చిత్రాన్ని వీక్షించిన జరిగింది. సినిమా చూసిన వాళ్ళు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా మొదటి 20 నిమిషాలు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందట.

తర్వాత వచ్చే కామెడీ ఎపిసోడ్స్, హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్స్ అలరిస్తాయి అని తెలుస్తుంది. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ వద్ద వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ను బాగా అట్రాక్ట్ చేస్తాయట. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ కంటెంట్ కూడా అందరూ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అంటున్నారు. క్లైమాక్స్ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ తో దర్శకుడు శ్రీను వైట్ల బాగానే ప్యాక్ చేసినట్లు తెలుస్తుంది.

‘విశ్వం’ లో హీరో గోపీచంద్ చాలా కొత్తగా కనిపిస్తాడట. అతని కామెడీ టైమింగ్ మునుపటి సినిమాల కంటే కూడా బాగా ఇంప్రూవ్ అయ్యింది అని అంటున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ లో ఎప్పటిలానే తన గ్రేస్ తో ఎంగేజ్ చేస్తాడట. కావ్య థాపర్ తన గ్లామర్ తో మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచినట్టు తెలుస్తుంది. సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్, వీటీవి గణేష్..ల కామెడీ కూడా అలరిస్తుందని సమాచారం.












