సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా ‘లూజర్’ వంటి వెబ్ సిరీస్ తెరకెక్కించిన అభిలాష్ కంకర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Superhero) . ‘వి సెల్యులాయిడ్స్’ ‘కామ్ ఎంటర్టైన్మెంట్’..సంస్థల పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజు సుందరం (Raju Sundaram ) , సాయి చంద్ (Sai Chand) , షియాజీ షిండే (Sayaji Shinde) వంటి వాళ్ళు కీలక పాత్రలు పోషించగా.. ఆర్నా హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్స్ చాలా ఇంప్రెస్ చేశాయి. అక్టోబర్ 11న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Maa Nanna Superhero First Review:
అయితే కంటెంట్ పై నమ్మకంతో రెండు రోజుల ముందు నుండి మేకర్స్ ప్రీమియర్స్ వేస్తున్నారు. ఆల్రెడీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పెద్దలు ఈ చిత్రాన్ని వీక్షించి.. తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. డబ్బు కోసం కన్న కొడుకుని అమ్మేసుకుంటాడు ఓ తండ్రి(సాయి చంద్). అయితే కొడుకు వచ్చినప్పటి నుండి కట్టుకున్న భార్యను, ఆస్తిని పోగొట్టుకున్నానే కోపంతో కొడుకుని(సుధీర్ బాబు) ని దూరం పెడతాడు మరో తండ్రి. అయితే పెంపుడు తండ్రిపై ప్రేమ ఎక్కువగా ఉన్న ఓ కొడుక్కి..
తర్వాత అతని అసలు తండ్రి వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు తలెత్తాయి.? అనేది ఈ సినిమా కథగా తెలుస్తుంది. ఇక సినిమా చూసిన వాళ్ళ టాక్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుందట. సుధీర్ బాబు, షియాజీ షిండే..లకి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని అంటున్నారు. మ్యూజిక్ కూడా ప్లెజెంట్ గా ఉంటుందట.
సీరియస్ కథాంశంలో వచ్చే లవ్ స్టోరీ కూడా ఆకట్టుకుంటుందని, కామెడీ కూడా చాలా నేచురల్ గా వచ్చిందని అంటున్నారు. తప్పకుండా ఈ దసరాకి ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది అని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు.