Pathaan: షారుఖ్ ఖాన్ సినిమాకి గవర్నమెంట్ సపోర్ట్!

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ జోరు మీదున్నాయి. హైదరాబాద్ తో సహా అన్ని ప్రధాన నగరాల్లో ఆన్ లైన్ అమ్మకాలు ఊపందుకున్నాయి. మొదటి రోజు రికార్డు ఓపెనింగ్ కలెక్షన్స్ వస్తాయని బయ్యర్లు భావిస్తున్నారు. ‘జీరో’ సినిమా డిజాస్టర్ తరువాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న షారుఖ్.. ఎట్టకేలకు ‘పఠాన్’తో అభిమానులను పలకరించనున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ‘భేషరమ్’ సాంగ్ లో దీపికా పదుకోన్ వేసుకున్న దుస్తులు, ఆమె చేసిన ఎక్స్ పోజింగ్ మీద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.

అది మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం ఉండడంతో నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు. పలు రాష్ట్రాలకు ముందుగానే రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. దీంతో గుజరాత్ ప్రభుత్వం స్పందిస్తూ.. జనవరి 25న ‘పఠాన్’ ప్రదర్శించే థియేటర్ల వద్ద సెక్యూరిటీ అందించాలని పోలీస్ డిపార్ట్మెంట్ ని ఆదేశిస్తూ ఉతర్వులు జారీ చేసింది. ఎవరైనా షోలను అడ్డుకోవాలని చూసినా.. అల్లర్లకు పాల్పడినా అరెస్ట్ చేయడం ఖాయం. మరోపక్క ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన మంత్రులకు పార్టీ క్యాడర్ కు ‘పఠాన్’ మీద అనవసర వ్యాఖ్యలు చేసి వివాదాలు సృష్టించవద్దని చెప్పినట్లు..

ముంబై మీడియా వర్గాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మొత్తానికి ‘పఠాన్’ భారీ సెక్యూరిటీతో రంగంలోకి దిగబోతుందన్నమాట. మొదటిరోజు కలెక్షన్స్ పై అంచనాలు రకరకాలుగా ఉన్నాయి కానీ.. బయ్యర్లు మాత్రం తొలిరోజే వంద కోట్లు వచ్చేస్తాయని అంచనా వేస్తున్నారు. సినిమాకి వచ్చే టాక్ ని బట్టి తరువాత నమోదయ్యే వసూళ్లు ఆధారపడి ఉంటాయి. సినిమా ఏవరేజ్ గా ఉన్నా చాలు.. షారుఖ్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపించేస్తాడు.

ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తెలుగు డబ్బింగ్ కూడా రెడీ అవ్వడంతో ఏపీ, తెలంగాణలో యష్ రాజ్ సంస్థ భారీ రిలీజ్ కు ప్లాన్ చేస్తోంది. అప్పటికి సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తయిపోతుంది కాబట్టి వాటికి ఇబ్బంది ఉండదు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus