డెబ్యూ మూవీ ‘ప్రేమ కథ’ ప్లాప్. ఆ తర్వాత చేసిన 4 సినిమాలు ‘యువకుడు’ ‘పెళ్లి సంబంధం’ ‘రామ్మా చిలకమ్మా’ ‘స్నేహమంటే ఇదేరా’ సినిమాలు కూడా ప్లాపులే. అయితే ‘సత్యం’ అనే చిత్రంతో కెరీర్ లో తొలి విజయాన్ని అందుకున్నాడు సుమంత్. అయితే అది లవ్ స్టోరీ.చక్రి మ్యూజిక్ కూడా ఆ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. అలా అని ఆ తర్వాత వెంటనే ఓ మాస్ సినిమా చేసేస్తాను అంటే.. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారన్న గ్యారెంటీ ఉండదు. కానీ మన సుమంత్ విషయంలో ఆ అద్భుతం జరిగింది. 2004 వ సంవత్సరం సెప్టెంబర్ 3న వచ్చిన ‘గౌరి’ చిత్రం అతనికి మంచి మాస్ హిట్ ను అందించింది. తమిళంలో విజయ్ నటించిన ‘తిరుమలై’ చిత్రానికి ఇది రీమేక్. బి.వి.రమణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రామ్ పెదనాన్న స్రవంతి రవి కిశోర్ నిర్మించాడు.
మరి ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 3.34 cr |
సీడెడ్ | 1.89 cr |
ఉత్తరాంధ్ర | 1.37 cr |
ఈస్ట్ | 0.69 cr |
వెస్ట్ | 0.61 cr |
గుంటూరు | 0.96 cr |
కృష్ణా | 0.74 cr |
నెల్లూరు | 0.34 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 9.94 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.21 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 11.15 cr |
‘గౌరి’ చిత్రానికి రూ.5.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.11.15 కోట్ల షేర్ ను రాబట్టింది.చాలా చోట్ల నిర్మాత స్రవంతి రవి కిశోర్ ఈ చిత్రాన్ని ఓన్ రిలీజ్ చేసుకున్నారు.మొత్తానికి గాను రూ.5.35 కోట్ల వరకు లాభాలు మిగిలాయని చెప్పొచ్చు. ఇలాంటి పెద్ద హిట్.. ఈ 17 ఏళ్ళలో సుమంత్ కొట్టలేకపోయాడు. ‘గోదావరి’ ‘పౌరుడు’ ‘గోల్కొండ హైస్కూల్’ ‘మళ్ళీరావా’ వంటి చిత్రాలు మాత్రం డీసెంట్ హిట్లు అనిపించుకున్నాయి అంతే.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!