సినిమా విడుదలైన రెండో రోజో మూడో రోజో వస్తున్న పైరసీ సీడీలనే ఆపడానికి మనవాళ్ళంతా నానా తంటాలు పడుతుంటే.. ఈమధ్య రిలీజ్ కి ముందే సినిమా పైరసీ వెర్షన్ ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతుంది. డీవీడీ సీడీ క్వాలిటీలో లభ్యమవుతున్న ఈ పైరసీ వెర్షన్ ను చూస్తే.. థియేటర్ లో చూసినట్లే ఉంటుంది. సినిమా సెన్సార్ కోసం ఒక కాపీని సెన్సార్ బోర్డ్ కు పంపుతారు. ఆ కాపీని ఎవరూ బయట ప్రదర్శించకుండా “సెన్సార్ కాపీ” అని సదరు ప్రింట్ పై లోగోను కూడా వేస్తారు.
మొన్న “ఉడ్తా పంజాబ్” సెన్సార్ కాపీని నెట్ లో పెట్టేశారు. విడుదలకు సరిగ్గా రెండ్రోజుల ముందే క్లీన్ కాపీ నెట్ లో పెట్టేయడంతో సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు అదే తరహాలో మరో బాలీవుడ్ సినిమా సెన్సార్ కాపీని కూడా నెట్ లో అప్లోడ్ చేసేశారు.
అడల్ట్ ఎంటర్ టైనర్ గా బాలాజీ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం “గ్రేట్ గ్రాండ్ మస్తీ”. జూలై 22న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు ఆన్ లైన్ లో లభ్యం అవుతుండడంతో.. నిర్మాతలు నానా బాధలు పడుతున్నారు!