Bigg Boss 5 Telugu: 80రోజులుగా సిరి -షణ్ముక్ ని చూస్తున్నాం అంటూ సిరి మదర్ కి చెప్పిన సన్నీ..!

బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామీలీ ఎమోషన్స్ తో హౌస్ కళకళలాడిపోతోంది. ముఖ్యంగా మానస్ మదర్ తుఫాన్ లా వచ్చి సందడి చేసి వెళ్లింది. హౌస్ మేట్స్ అందరూ మానస్ మదర్ తో మాటలకి బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా శ్రీరామ్, రవి, షణ్ముక్ , సిరి , పింకీలు బాగా సంబరపడపోయారు. అయితే, హౌస్ లోకి ఎవరు వచ్చినా వాళ్లు చెప్పిన మాటలని బాగా తీస్కుని ఆలోచనలో పడుతున్నారు. దీంతో ప్రతి మాట చాలా వాల్యుబుల్ అయ్యింది. ఇక్కడే సిరి వాళ్ల అమ్మగారు శ్రీదేవి వచ్చినపుడు డైరెక్ట్ గా నువ్వు షణ్ముక్ ని హగ్ చేస్కోవడం నాకు నచ్చడం లేదని చెప్పేశారు. గేమ్ లో ఒక తండ్రిలాగా, అన్నయ్యలాగా, ఫ్రెండ్ లాగా ఉంటున్నాడు అని దగ్గరవుతున్నావ్ అంటూ చెప్పారు. దీంతో హౌస్ మేట్స్ రవి, పింకీ, శ్రీరామ్ లు దీనిపైన డిస్కషన్స్ పెట్టారు.

గార్డెన్ ఏరియాలో హౌస్ మేట్స్ తో మరోసారి ఈ టాపిక్ ని తీస్కుని వచ్చింది సిరి మదర్. దీంతో అక్కడే ఉన్న సన్నీ వాళ్ల ప్రెండ్షిప్ ఎంత గొప్పదో చెప్పాడు. నేను మానస్ ఎలాగైతే హౌస్ లో ఉంటామో సేమ్ టు సేమ్ అలాగే వాళ్లిద్దరూ కూడా ఉంటారని, 80 రోజులుగా చూస్తున్నామ్ మాకు తెలీదా అంటూ చెప్పాడు. అంతేకాదు, ఈవిషయంలో వాళ్లు ఎక్కడ బ్యాడ్ అవుతారో అని వాళ్లగురించి చాలా పాజిటివ్ నోట్ తో మాట్లాడాడు సన్నీ. ఇద్దరూ ఒకరినొకరు చాలా కేరింగ్ గా చూసుకుంటారని, ఇద్దరిమద్యలో ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ అలా ఉందని చెప్పాడు. దీంతో సన్నీ ఎక్కడికో వెళ్లిపోయాడు. తోటి హౌస్ మేట్స్ దీనిపై ఎలా స్పందించాలా అని ఆలోచిస్తున్న తరుణంలో సన్నీ ఇలా మాట్లాడటం అనేది హైలెట్ అయ్యింది. అంతేకాదు, షణ్ముక్ సైతం దీనిపై ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు.

అయితే, ఇప్పుడు సన్నీ సిరి గురించి ఇంకా షణ్ముక్ గురించి అన్నమాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. సన్నీకి మిగతా హౌస్ మేట్స్ కి తేడా ఇదే చూడండి అంటూ సన్నీ ఫ్యాన్ గ్రూప్స్ లో ఈవీడియోని షేర్ చేస్తున్నారు. అంతేకాదు, సన్నీ గొప్పదనం ఇప్పుడికైనా తెలిసిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదీ మేటర్.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus