టాలీవుడ్లో ఉన్న బడా నిర్మాణ సంస్థల్లో ‘యూవీ క్రియేషన్స్’ కూడా ఒకటి. ఇది ప్రభాస్ కు హోమ్ బ్యానర్ లాంటిది. ప్రభాస్ నటించిన ‘మిర్చి’ చిత్రంతో ఈ బ్యానర్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని మిడ్ రేంజ్ సినిమాలు చేస్తూనే ప్రభాస్ తో ‘సాహో’ ‘రాధే శ్యామ్’ వంటి పాన్ ఇండియా సినిమాలను నిర్మించింది ఈ సంస్థ.ప్రభాస్ పారితోషికం కూడా తీసుకోకుండా ఈ బ్యానర్లో సినిమాలు చేశాడు. తర్వాత లాభాల్లో వాటా తీసుకున్నాడు లెండి.
త్వరలో ప్రభాస్ నుండి రాబోతున్న ‘ఆదిపురుష్’ చిత్రాన్ని కూడా తెలుగులో రిలీజ్ చేయబోతుంది ఈ సంస్థ.మరోపక్క రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా నిర్మించడానికి రెడీ అవుతుంది. ఇదిలా ఉండగా..తాజాగా ‘యూవీ క్రియేషన్స్’ పై జీఎస్టీ అధికారులు రైడ్స్ చేయడం చర్చనీయాంశం అయ్యింది.ఈ సంస్థ పన్ను ఎగ్గొట్టినట్టు భావించి జీఎస్టీ అధికారులు మంగళవారం నాడు ఈ సంస్థ కార్యాలయం పై సోదాలు నిర్వహించారు అని సమాచారం. వీరి సినిమాలు విడుదల టైంలో కూడా పన్ను ఎగ్గొట్టారా?
అనే విషయం పై కూడా అధికారులు ఎంక్వైరీ చేసి తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై స్పందించిన ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ వారు ఈ రైడ్స్ అనేవి సర్వసాధారణం. గతంలో కూడా పలుసార్లు జరిగాయి అంటూ చెప్పుకొచ్చారు.ప్రభాస్ కు సోదరుడు లాంటి ప్రమోద్ ఉప్పలపాటి…
ఆయన ఫ్రెండ్స్ వంశీకృష్ణారెడ్డి, విక్రమ్ కృష్ణారెడ్డి లతో కలిసి 2013లో ‘మిర్చి’ తో నిర్మాతలుగా ఎంట్రీ ఇచ్చారు. విక్రమ్ కృష్ణారెడ్డి.. రామ్ చరణ్ కు కూడా బెస్ట్ ఫ్రెండ్. ‘రన్ రాజా రన్’ ‘జిల్’ ‘మహానుభావుడు’ ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ‘భాగమతి’ ‘టాక్సీ వాలా’ ‘భలే భలే మగాడివోయ్’ ‘భాగమతి’ ‘హ్యాపీ వెడ్డింగ్’ వంటి చిత్రాలను నిర్మించింది.
Most Recommended Video
‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!