Gully Rowdy Movie: సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ నిర్మాత షాకింగ్ కామెంట్స్..!

సినిమా వేడుకల్లో.. ‘మేము గొప్ప సినిమా తీసాం’ ‘మా సినిమా సూపర్ హిట్ అవుతుంది’ ‘మా సినిమా చరిత్రలో నిలిచిపోతుంది’ అంటూ మేకర్స్ తమ సినిమా గురించి డబ్బా కొట్టుకోవడం మామూలే. ప్రమోషన్లు అంటే ఆ మాత్రం ఉండాలి అనేంత మెచ్యూరిటీ జనాలకి కూడా వచ్చేసింది కాబట్టి.. హ్యాపీగా సినిమా వాళ్ళు ఇలాంటి వేడుకలు వరుసగా చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళ సినిమాని మరింతగా ప్రమోట్ చేసుకుంటున్నారు. అయితే అంతకు మించి అన్నట్టు ఈ మధ్య కాలంలో కొంతమంది సినిమా మేకర్స్ కాస్త అతిగా మాట్లాడుతూ వస్తున్నారు.

‘పాగల్’ ప్రీ రిలీజ్ వేడుకలో విశ్వక్ సేన్, ‘రాజ రాజ చోర’ ప్రీ రిలీజ్ వేడుకలో శ్రీవిష్ణు.. ఇలాగే కాస్త అతి కి పోయారు. అయితే శ్రీవిష్ణు తన సినిమా మీద కాన్ఫిడెన్స్ తో ఆ రేంజ్లో మాట్లాడాడని ఆ సినిమా ఫలితం ప్రూవ్ చేసింది. అయితే విశ్వక్ సేన్.. తన సినిమా గురించి కంటే తన గురించి ఎక్కువ డబ్బా కొట్టుకోవడం వల్ల భయంకరమైన ట్రోలింగ్ కు గురయ్యాడు. ఇక వీళ్ళ లిస్ట్ లోనే తాజాగా సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ జాయిన్ అయ్యారు.

ఎం.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘మా సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు ఎంతో కష్టపడి చేశారు.అందరినీ నవ్వించే ఉద్దేశంతో తీసిన ఇది. ఈ చిత్రం కచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుంది.మరో వారంలో సక్సెస్ మీట్లు వంటివి కూడా చేస్తాం.ఇది కనుక ఫెయిలైతే నేను ఇంకో సినిమా చేయను’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus