Gunasekhar: శాకుంతలం రిజల్ట్ తో రూట్ మార్చిన గుణశేఖర్.. లక్ష్యాన్ని సాధిస్తారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు గుణశేఖర్ కు (Gunasekhar) ప్రత్యేక గుర్తింపు ఉంది. గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. చూడాలని ఉంది, ఒక్కడు (Okkadu) , రుద్రమదేవి (Rudhramadevi) , మరికొన్ని సినిమాలు గుణశేఖర్ రేంజ్ ను పెంచాయి. అయితే గుణశేఖర్ కొత్త సినిమా యుపోరియా అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. శాకుంతలం (Shaakuntalam) మూవీ నిర్మాతలకు భారీ నష్టాలను మిగల్చడం గమనార్హం. కొత్త నటీనటులతో గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా ఈ సినిమా కోసం గుణశేఖర్ తన టీమ్ ను పూర్తిస్థాయిలో మార్చేశాడని సమాచారం అందుతోంది.

Gunasekhar

ఈ సినిమాకు కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయనున్నారని భోగట్టా. గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా కొత్త టీమ్ వల్ల యుపోరియా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. గుణశేఖర్ తర్వాత సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకుని కెరీర్ పరంగా మళ్లీ బిజీ అయితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గుణశేఖర్ ప్రస్తుత ప్రాజెక్ట్ లు పరిమిత బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయని తెలుస్తోంది. గుణశేఖర్ యుపోరియా సినిమాతో హిట్ సాధిస్తే ఆయనకు మరికొన్ని సినిమా ఆఫర్లు వచ్చే అయితే ఉన్నాయని చెప్పవచ్చు. గుణశేఖర్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకుని మరింత ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు. గుణశేఖర్ కు భవిష్యత్తు సినిమాలు నిర్మాతగా కూడా భారీ విజయాలను సొంతం చేసుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

గుణశేఖర్ ఈ తరం ప్రేక్షకులకు నచ్చే కథలను ఎంచుకుంటే కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కే అవకాశాలు ఉంటాయి. గుణశేఖర్ నవ్యత ఉన్న కథాంశాలకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుణశేఖర్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో పూర్వ వైభవం వస్తుందో లేదో చూడాల్సి ఉంది. గుణశేఖర్ డైరెక్షన్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.

‘సత్యం సుందరం’.. కలెక్షన్స్ గురించి వర్రీ అవుతున్న కార్తీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus