Gunasekhar: చూడాలని ఉంది సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన గుణశేఖర్!

గుణశేఖర్ దర్శకత్వంలో తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం.ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇకపోతే తాజాగా డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.మెగాస్టార్ చిరంజీవి నటించిన చూడాలని ఉంది సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

చిరంజీవి అంజలా జవెరి నటించిన ఈ సినిమా అప్పట్లో ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలోని రైల్వేస్టేషన్లో జరిగే సన్నివేశం ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సన్నివేశం అని చెప్పాలి. తాజాగా ఈ సీన్ గురించి గుణశేఖర్ పలు విషయాలను తెలియజేశారు.పది నిమిషాల పాటు సాగే ఈ సన్నివేశంలో ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం చూపులతోనే చిరంజీవి అంజలా జవేరి ఎంతో అద్భుతంగా నటించారు. ఇలా చిరంజీవి చూపులతోనే హీరోయిన్ తనతో ప్రేమలో పడటం తనతో కలిసి వెళ్లిపోవడం జరుగుతుంది.

అయితే చిరంజీవి గారితో ఈ సన్నివేశం చేయడానికి తనకు (Gunasekhar) చాలెంజ్ అనిపించిందని తెలిపారు. ఇక ఈ సన్నివేశాన్ని చేయడం కోసం నిజమైన రైల్వేస్టేషన్లో అయితేనే చాలా రియల్ గా వస్తుందని నిర్మాత అశ్వినీ దత్ కి చెప్పగా మెగాస్టార్ వంటి స్టార్ హీరోతో నిజమైన రైల్వేస్టేషన్లో సినిమా చేయడం అసాధ్యమని తెలిపారు. ఇక నేను ఈ విషయంలో పట్టుబట్టడంతో రెండు రోజులపాటు ఒకరోజు నాంపల్లి రైల్వేస్టేషన్లో మరొక రోజు కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించామని తెలిపారు.

అయితే ఈ సన్నివేశం షూటింగ్ జరిగే సమయంలో పెద్ద ఎత్తున అభిమానులు చుట్టుముట్టారని అయితే వారిని కంట్రోల్ చేయడం కోసం అశ్వినీ దత్ కర్ర పట్టుకుని నిలుచున్నారు అంటూ ఈ సందర్భంగా గుణశేఖర్ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus