హిలేరియస్ కామెడీతో విశేషదారణ దక్కించుకుంటున్న ‘గుండమ్మ కథ’ మూవీ..!

‘ఆదిత్య క్రియేషన్స్’ బ్యానర్ పై లక్ష్మీ శ్రీవాత్సవ దర్శకత్వం వహించడమే కాకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తాజా చిత్రం  ‘గుండమ్మ కథ’. ఆదిత్య, ప్రణవ్య, గెటప్ శ్రీను, భాషా, కనక దుర్గ, వేణు గోపాల్, శోభా రాణి తదితరులు కలిసి నటించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నీరాజనాలను పొందుతుంది.

‘గుండమ్మ కథ’ ఓ ఫ్యామిలీ డ్రామా. ఓ కుటుంబంలో ఏర్పడ్డ ఆస్తి పంపకాల సమస్యను ఆధారం చేసుకుని ఈ చిత్రం తెరకెక్కింది. గుండమ్మ(కనక దుర్గ) అనే ఓ ఇంటి పెద్ద ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న తన వారసుల చేష్టలతో విసిగిపోయి తన ఆస్తిని తన మనవరాలు అంజలి(లావణ్య) పేరు పై రాసేస్తుంది.ఆ విషయం ఆమెకు తెలీదు. దాంతో అంజలి సమస్యల్లో చిక్కుకుంటుంది. అయితే ఆమె చెల్లిని ప్రేమించిన హీరో(ఆదిత్య) అంజలికి అండగా నిలబడి ఆమె ఎదుర్కొంటున్న సమస్యలను  ఎలా పరిష్కరించాడు అనేది మిగిలిన కథ.

గెటప్ శ్రీను, బాషా ల కామెడీ ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సినిమా బోరు కొడుతోంది అనే టైములో వీళ్ళ నుండీ వచ్చే కామెడీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. అలాగే డైలాగులు కూడా యూత్ ను ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే విధంగా ఉన్నాయి.

దర్శకుడు క్యారెక్టర్లను పరిచయం చేసిన విధానం చాలా తికమకగా ఉంటుంది. హీరో తండ్రి పాత్ర కూడా సినిమాకి ఫిట్ అవ్వలేదు అనిపిస్తుంది. సినిమాటోగ్రపీ, సంగీతం బాగున్నాయి. ఎడిటింగ్ లోపాలు చాలానే ఉన్నాయి.మొత్తంగా గెటప్ శ్రీను, భాషా ల కామెడీ … ఇంట్రెస్టింగ్ థీమ్ కలగలిపి ఈ సినిమాని థియేటర్లలో మిస్ అయిన వాళ్ళు ఓటిటిలో అయినా సరే చూసే విధంగా చేస్తాయని చెప్పొచ్చు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus