సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానున్న గుంటూరు కారం మూవీ ప్రమోషన్స్ ఇప్పటికే మొదలయ్యాయి. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. యూఎస్, యూకేలో గుంటూరు కారం మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రచ్చ మామూలుగా లేదు. 28 లొకేషన్లలో 90 షోల కోసం ఈ బుకింగ్స్ మొదలయ్యాయి. ఒక్క థియేటర్ లో ఈ సినిమాకు సంబంధించి 600 టికెట్లు అమ్ముడవగా రిలీజ్ కు మరో రెండు వారాల సమయం ఉన్న నేపథ్యంలో ఈ మూవీ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.
ఈ సినిమా టికెట్స్ కోసం తెలుగు రాష్ట్రాల్లో గట్టి పోటీ ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు లేడీస్ లో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ట్రైలర్ రిలీజైతే ఈ సినిమా కథకు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మహేష్ బాబు కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలుస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు మహేష్ బాబు 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.
మహేష్ బాబు వయస్సు పెరుగుతున్నా లుక్స్ విషయంలో సినిమా సినిమాకు మహేష్ బాబు యంగ్ గా కనిపిస్తూ తన నటనతో ఆకట్టుకుంటున్నారు. గుంటూరు కారం మూవీకి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో సినిమా తర్వాత తెరకెక్కించిన సినిమా ఇదే కావడం గమనార్హం.
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు. గుంటూరు కారం మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. (Guntur Kaaram) గుంటూరు కారం మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.